షర్మిల: పార్టీలోనే నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారా..?
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఇప్పుడు షర్మిలనీ వీరే వద్దంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయట. గత రెండు మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు వల్ల కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అధిష్టానానికి సైతం ఒక లేఖని రాసుకున్నట్లు సమాచారం. అక్కడ కూడా షర్మిల గురించి ఆయన ప్రస్తావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాస్తవానికి పార్టీ ఓటు బ్యాంకు పెరగాల్సిన సమయం కూడా దగ్గరకు పడిందని సీనియర్లు చెబుతున్న మాట పట్టించుకోలేదనే విధంగా షర్మిల పైన చాలామంది విమర్శిస్తున్నారట.
స్థానిక ఎన్నికలు వచ్చేయేడాది జరగబోతున్నాయని ఇలాంటి సమయంలో ప్రజలకు ఎలాంటి మోటివేషన్ చేసేలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టలేదని పలువురు కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు. కేవలం ఆమె నచ్చిన రీతిలోనే ఆమె ముందుకు వెళుతుంది అన్నట్టుగా పెదవి వివరిస్తున్నారట. ఈ విషయాన్ని అన్ని ప్రాంతాలలోని నాయకులూ కూడా ఖండించినట్లు సమాచారం. ఒకవేళ షర్మిల ఇలాగే కొనసాగితే రాబోయే పదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరగడం చాలా కష్టమని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. ఇటీవలే విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా నిలిచిన షర్మిల ఆమెకు తప్ప ఇతరుల ఎవ్వరికి కూడా ఆమె మద్దతు తెలిపినట్లు తెలియడం లేదని పలువురు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. దీన్ని బట్టి చూస్తే అసలు షర్మిలనే ఏపీ కాంగ్రెస్ పార్టీకి వద్దనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయం పైన అట్టు షర్మిల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.