చంద్రముఖిలా మారుతున్న పవన్.. కెవ్వుకేక నా సామి రంగా?

Veldandi Saikiran
టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... రోజుకో అవతారం ఎత్తుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అచ్చం గంగా నుంచి చంద్రముఖిలా మారినట్లే.. ఆయన మారిపోతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు అయింది. అయితే ఈ 10 సంవత్సరాలలో పవన్ కళ్యాణ్.... జతకట్టని పార్టీ లేదు... తిరగని జాగా లేదు. కమ్యూనిస్టు నుంచి బిజెపి వరకు... అన్ని పార్టీలతో దోస్తాన చేసిన పవన్ కళ్యాణ్... ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నారు.

అప్పట్లో... సెక్యులరిజం  అంటూ.. ఉపన్యాసాలు ఇచ్చిన.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. సనాతన ధర్మమంటూ హిందూ మార్గంలో నడుస్తున్నారు. తన అవసరాలకు అనుగుణంగా... పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అదే దారిలో వెళ్తున్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా... వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ లో పూర్తిగా మార్పు వచ్చి...ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఆయన బిజెపి కంటే ఎక్కువగా హిందుత్వ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. వైసిపి కూడా అదే ప్రచారాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకువెళ్తోంది. మొన్న తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో కూడా ఇలాగే స్పందించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.  జగన్మోహన్ పాలనలోనే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని.. చాలాసార్లు చెప్పుకుని చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో... రివర్స్లో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్.
తిరుమల లడ్డును జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడని తాను ఎక్కడ చెప్పలేదు... అంటూ దశావతారం ఎత్తుతున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత.. తిరుమలకు నడుచుకుంటూ వెళ్లి.. తీవ్ర అస్వస్థత అంటూ... సెంటిమెంట్ రాజకీయాలను కూడా రగుల్చుతున్నారు  పవన్ కళ్యాణ్. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవారికి కోర్టులు సపోర్ట్ గా నిలుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: