కొండ సురేఖకు మద్దతుగా తీన్మార్ మల్లన్న..?

Suma Kallamadi
గడిచిన రెండు మూడు రోజులుగా సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం పై, హీరోయిన్ సమంతపై తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి అందరికీ విధితమే. ఈ క్రమంలో కొండా సురేఖ చేసిన  కామెంట్స్ పై తెలుగు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది. కేవలం తెలుగు సినీ తారలే కాకుండా కుష్బూ లాంటి ఇతర భాష నటులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. చివరకు కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం బహిరంగగానే సురేఖ చేసిన వాక్యాలను తప్పు పట్టడం, అలాగే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, తాజాగా కొండ సురేఖకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. కొండా సురేఖకు మద్దతు ఇవ్వడంతో పాటు నాగార్జున పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక బీసీ మహిళ మంత్రి కాబట్టి కొండా సురేఖ పై నాగార్జున కాలు దువ్వుతున్నాడని, అతడి సంగతి ఏమిటో చూస్తాము అంటూ తీన్మార్ మల్లన్న ఫైర్ అయినట్లు తెలుస్తుంది.
ఇటీవల కాలంలో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ను కబ్జా చేసి కట్టినట్లు వచ్చిన సంఘటనకు అందరూ ఎందుకు మాట్లాడలేదనీ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. ఈ క్రమంలో నాగార్జున నువ్వు తప్పు చేస్తున్నావు..  నువ్వు హీరోవి కాదు విలన్ వి  అంటూ కామెంట్స్ చేశాడు. కొండా సురేఖకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇలా చేస్తే మేము సహించము అంటూ తీన్మార్ మల్లన్న మార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నాగార్జున పై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కొండ సురేఖ పై నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి పరువు రాష్ట్రం కేసు విచారణ కాస్త వాయిదా పడింది. ఇందుకు గల ముఖ్య కారణం న్యాయమార్తి సెలవులో ఉన్నందున ఈ కేసు విచారణ కాస్త అక్టోబర్ 7 కి వాయిదా పడినట్లు తెలుస్తోంది.. నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పిటీషన్ లో "దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతోనే నిరాధార ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయని" తెలిపినట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఈ వివాదం ఎలా ముగింపు పలుకుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: