ఉద‌య‌నిధి దెబ్బ అదుర్స్‌.. పవన్‌ కళ్యాణ్‌ పై పోలీసు కేసు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ కొనసాగుతోంది. సనాతన ధర్మం.. పేరుతో ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ ముఖ్యమంత్రుల మధ్య.. యుద్ధం మొదలైంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో... తమిళనాడు కొత్త డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్... సనాతన ధర్మం పైన ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మం అనేది మలేరియా అలాగే డెంగ్యూ లాంటిదంటూ... ఎన్నికల ప్రచారంలో బిజెపిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. దీంతో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయినిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి. స్వయంగా నరేంద్ర మోడీ లాంటి నేతలు కూడా దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చారు.  అయితే ఇలాంటి నేపథ్యంలో తిరుమల శ్రీవారిని తాజాగా దర్శించుకున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన పరోక్షంగా స్పందించారు.

పేరు ప్రస్తావించకుండా... పరోక్షంగా ఉదయనిది స్టాలిన్ ను పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినట్లు స్పష్టంగా ఇందులో అర్థం అవుతుంది. సనాతన ధర్మాన్ని కొంతమంది డెంగ్యూ అలాగే మలేరియా లాంటి దానితో పోలుస్తున్నారని... అలాంటి వారి వల్ల ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం కోసం తాను ఎక్కడికైనా పోరాటం చేస్తానని..డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది. ఉదయ్ నిధి స్టాలిన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. ఈతరణంలోనే తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయం నిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై... స్పందిస్తూ వెయిట్ అండ్ సి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే.. పవన్‌ కళ్యాణ్‌ పై మధురై పోలీస్‌ కేసు అయింది. ఓ లాయర్‌ ఈ కేసు పెట్టారు. ఉదయ్‌ నిధి స్టాలిన్‌ పై వ్యాఖ్యలు.. రెండు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టే ధోరణితో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయింది. దీనిపై పవన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: