ఏపీ: పేరుకే కూటమి.. అంతా దబిడి దిబిడే..?

Divya
2024 ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి టిడిపి ,బిజెపి ,జనసేన పార్టీలు అన్ని కలిసి బాగా పనిచేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అయితే అలా అధికారం వచ్చిందో లేదో అప్పుడే కూటమిలో అసలైన తేడాలు కనిపిస్తున్నాయట. పవర్ పొలిటికల్స్ లో ఎవరు వారు తమని తాము నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కూటమిలో భాగంగా ధర్మం కోసం సీట్లు త్యాగం చేశామని అందుకే టిడిపి నేతలు తమకు విలువ ఇవ్వాలంటు నేతలను హెచ్చరిస్తున్నారట. అంతేకాకుండా వారు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఇలా అన్ని వైపులా నుంచి సీనియర్లు ఉన్నామని చెప్పకనే చెబుతున్నారట. కానీ ఎమ్మెల్యేగా నెగ్గిన వారు మాత్రం.. వారు కూడా తమలాగే బలపడాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మేము ఎక్కువ అంటే మాది ఆధిపత్యం అన్నట్టుగా చాలామంది కూటమిలో తన్నుకుంటున్నారు.. మొదటినుంచి పిఠాపురంలో కూటమి నేతల మధ్య సంగీత లేదనే విధంగా వార్తలు వినిపించాయి అందుకు తగ్గట్టుగానే ఇటీవలే అర్బన్ కో-ఆపరేటర్ బ్యాంకు విషయంలో కూడా పెద్ద చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి కూడా టిడిపి నేతలు అక్కడ అసంతృప్తితో ఉన్నారట.

అలాగే రాయలసీమలో చూస్తే ఆదోనిలో పొత్తులో భాగంగా బిజెపికి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ బిజెపి పార్టీ గెలిచిన మాజీ ఎమ్మెల్యే గా పేరుపొందిన మీనాక్షి నాయుడు టిడిపి పార్టీని చాలా బలంగా ఉంచారు. అలా అక్కడ టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లుగా కొనసాగుతోంది.
మరొకవైపు వస్తే తిరుపతిలో గతంలో వైసీపీలో ఉన్న అరణి శ్రీనివాసులు జనసేన పార్టీలోకి వచ్చి తన హవా చూపిస్తున్నారట. ఇక్కడ కూడా టిడిపి కంచుకోటగా ఉన్నప్పటికీ జనసేన పార్టీకి సీటు ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అలాగే మరొకవైపు అనంతపురంలోని ధర్మవరంలో బిజెపి నేత సత్య కుమార్ నిలబడి గెలిచారు.అక్కడ కూడా మున్సిపల్ కమిషనర్ నియమించే సమయంలో టిడిపి, బిజెపి నేతల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయట.

కోస్తా , ఉత్తరాంధ్ర వైపుగా వస్తే.. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే అక్కడ టిడిపి సీనియర్ నేత దామచర్ల జనార్దన్ రావుకు అస్సలు పడడం లేదట.

ఉత్తరాంధ్రలో బిజెపి జనసేన సీట్ల కోసం తమ తమ పలుకుబడులను చూపిస్తూనే ఉన్నారు.

ఇలా పేరుకే కూటమి ఏర్పరచుకున్న గెలిచిన తర్వాత అంతా కూడా దబిడి దిబిడే గా కూటమి పరిస్థితి మారిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: