ఎగ్జిట్‌పోల్స్.. జమ్ము, హర్యానాలో ఓటర్లు ఎటువైపు..?
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న జమ్ము కాశ్మీర్ అలాగే హర్యానా రాష్ట్రాల ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు బిజెపి పార్టీ... ఈ రెండు రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ ఫలితాలలో వెల్లడిస్తున్నాయి. శనివారం రోజున.. అంటే ఇవాళ సాయంత్రం హర్యానాలో తుది విడత ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే ఎగ్జిట్ ఫలితాలను రిలీజ్ చేశాయి సర్వే సంస్థలు.
హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో.. 90 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే హర్యానాలో 90 అటు జమ్ము కాశ్మీర్లో 90 స్థానాలు ఉన్నాయన్నమాట. ఈ అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. అక్టోబర్ 8వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు.. రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని స్పష్టమైన.. లెక్కలతో చెబుతున్నాయి.
ముందుగా హర్యానా ఎగ్జిట్ ఫలితాలు చూసుకున్నట్లయితే.. అన్ని సర్వేల యావరేజ్ ప్రకారం... హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని చెబుతున్నాయి. అక్కడ 46 స్థానాలు మెజారిటీ ఫిగర్. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి 55 స్థానాల నుంచి 60 వచ్చే ఛాన్స్ ఉందట. అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా.. అధికారంలోకి కూడా రాబోతుంది. బిజెపి పార్టీకి 26 స్థానాలు మాత్రమే వస్తాయని... ఈ సర్వే సంస్థలు తెలిపాయి.
ఇక జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ పల్స్... సర్వే ప్రకారం.. బిజెపికి 23 నుంచి 27 స్థానాలే వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 స్థానాలు వస్తాయని సర్వే సంస్థలు తెలిపాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మాత్రం 33 నుంచి 35 స్థానాలు గెలుచుకొని జమ్ములు లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందట. ఎన్డి టీవీ సర్వే ప్రకారం... హంగ్ తేలింది. రిపబ్లిక్ మాట్రిజ్ ప్రకారం.. బిజెపికి 25, పీడీపీ పార్టీకి 28 స్థానాలు వస్తాయని తెలిపింది ఈ సర్వే సంస్థ. కాంగ్రెస్‌కు 12, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15 స్థానాలు వస్తాయని వివరించింది. అంటే ఓవరాల్ గా బీజేపీ కాకుండా మిగతా అన్ని పార్టీలు కలిసి అక్కడ అధికారం పంచుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.