ఏపీ: డిప్యూటీ సీఎం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలరా..?

Divya
గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ కు కేంద్రం నుంచి పలుకుబడి ఉందంటు ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు.అందుకు ఉదాహరణ గడిచిన రెండేళ్ల  క్రితం సరిగ్గా ఇదే నెలలో విశాఖపట్నం కి వచ్చిన ప్రధాన మోడీకి పవన్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించి మరి గంటకు పైగా భేటీ అయి మాట్లాడడం జరిగింది దీన్ని చూసిన తర్వాత పవన్ కి మోడీ దగ్గర బాగానే పలుకుబడి ఉందని అందరూ అనుకున్నారు. అయితే ఆనాడు సీఎం గా జగన్ వేదిక మీద ప్రధానిని కలవడం జరిగింది. అలా ఒకరోజు ముందు మోడీతో సమావేశమై రాజకీయాలతో ముచ్చటించారు పవన్ కళ్యాణ్.
ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మిత్రుల సమక్షంలో మోదీ చెప్పడం కూడా జరిగింది. సరిగ్గా ఇదే పదం మీద డిప్యూటీ సీఎం హోదాల వలన పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మిక సంఘం నేతలను కలిసి పవన్ కళ్యాణ్ తో తమ గోడును సైతం చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు. పవన్ ఒక్కడే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆపగలరని నమ్మకం వారిలో ఉన్నది దీంతో పవన్ కళ్యాణ్ కోర్టుకి ఎక్కి ఉక్కు కర్మాగారం ఆపే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విశాఖ ఉక్కుని నడపాలి అంటే పదివేల కోట్ల వరకు అవసరం పడుతుందట అలాగే నష్టాలను కేంద్రం మాఫీ చేయాలని సొంత నిధులను సమకూర్చేలా ప్లాన్ చేయాలని అంతే కాకుండా వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయించేలా చూడాలట. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు ఎప్పుడు మక్కువ చూపమని విషయాన్ని కూడా చెప్పాలి. సముద్రం ఒడ్డున ఏకైక ఉన్న స్టీల్ ప్లాంట్ విశాఖ అనే కాదు అంతే కాకుండా జల రవాణాతో చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎగుమతులను కూడా చేయగలిగే అవకాశం ఈ పోర్టుకు ఉన్నది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల వల్ల ప్రొడక్షన్ రాలేదని.. వచ్చిన వాటికి కూడా మంచి గిరాకీ ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణం కాకుండా ఆపగలరా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: