ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..729 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు సైతం ఉద్యోగం నోటిఫికేషన్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో KGBV లో 2014-2025 గాను 729 బోధనేతర పోస్టులకు సంబంధించి ఔట్ సోర్సింగ్  ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పిడి శ్రీనివాస్ ఇటీవల ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన వారందరూ కూడా అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చంటూ తెలియజేశారు. అయితే మొత్తం పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా టైప్- 3 KGBV లో 547 పోస్టులు ఉన్నాయని.. టైప్-4 లో 182 పోస్టులు ఉన్నాయని తెలిపారు.

అలాగే టైప్-3 లో హెడ్ కుక్ పోస్టులు 48 ఉండగా, అలాగే వాచ్ ఉమెన్ పోస్టులు 95, స్వీపర్ పోస్టులు 62, అసిస్టెంట్ కుక్ పోస్టులు 263, స్కావెంజర్ పోస్టులు 79, టైప్ -4 లో హెడ్ కుక్ పోస్టులు 48, చౌకిదర్ 58 పోస్టులు ఉన్నాయి,అసిస్టెంట్ కుక్ పోస్టులు 76 పోస్టులు కలవు ఈ పోస్టులన్నీ కూడా విడుదల చేసిన నోటిఫికేషన్ కిందే భర్తీ చేయబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఆయా మండలాలలో వాటికి సంబంధించిన వాటికి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు.

ఈనెల 17వ తేదీ వరకు ఉంటుందని ఇటీవల 604 బోధన, బోధనేతర  ఔట్ సోర్సింగ్ ,ఒప్పందం ప్రతిపాదకంగానే ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలియజేశారు. అయితే వీటికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నిర్వహించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లో నిరుద్యోగులు చూసి మరి అప్లై చేసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా KGBV లో పోస్ట్లు విడుదల చేయడం ఏపీలో ఉండే నిరుద్యోగులకు కాస్త వరం అని కూడా చెప్పవచ్చు. మరి నిరుద్యోగులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకొండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: