వైసీపీలో జగన్ స్థాయి నేత లేనట్టేనా.. మరో నేత ఎదగడానికి జగన్ ఛాన్స్ ఇవ్వట్లేదా?
వైసీపీలో గుర్తింపు ఉన్న నేతలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా జగన్ స్థాయి ప్రజా మద్దతు ఉన్న నేతలెవరూ లేరనే చెప్పాలి. జగన్ కు వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం సొంత కుటుంబ సభ్యుల మద్దతు కూడా లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి దారుణంగానే ఉన్నా 2029 ఎన్నికల సమయానికి పార్టీ పుంజుకుంటుందని జగన్ భావిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
కూటమి ప్రకటించిన పథకాలను అమలు చేయడం అసాధ్యమని అందువల్ల 2029లో వైసీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే కూటమి సర్కార్ మాత్రం ఒకేసారి పథకాలను అమలు చేయకుండా ఒక్కొక్కటిగా అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ కూటమిపై వ్యతిరేకత వైసీపీకి ప్లస్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.
దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను అమలు చేస్తామని కూటమి సర్కార్ అమలు చేస్తుండగా ఈ స్కీమ్ అమలైతే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి కూటమి సర్కార్ ఏవైనా నిబంధనలు అమలు చేస్తుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. కూటమి మరికొన్ని కీలక పథకాలను ఎప్పటినుంచి అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.