కెసిఆర్ తర్వాత బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి.. అందరికీ ఉత్కంటే..?

Pulgam Srinivas
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన రాజకీయ నాయకులలో కెసిఆర్ ఒకరు. ఈయన రాజకీయ జీవితాన్ని   యువజన కాంగ్రెస్ ద్వారా మొదలు పెట్టి ఆ తర్వాత కొంత కాలం పాటు అందులో కొనసాగాడు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలోకి వచ్చి తెలుగు దేశం పార్టీలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇక ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధముద్దేశంగా టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పార్టీని స్థాపించాడు. ఇక ఈ పార్టీ స్థాపించిన మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను కేసీఆర్ ఎదుర్కొన్న ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు.

ఇక 2014 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు. దానితో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక రెండవ సారి జరిగిన ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకోవడంతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇకపోతే కొంత కాలం క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. టిఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. ఇకపోతే టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత వారసులు ఎవరు ..? టిఆర్ఎస్ పార్టీని నడిపించేది ఎవరు అనే చర్చ చాలా రోజులుగా చాలా మంది లో నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇక కెసిఆర్ కుమారుడు అయినటువంటి కేటీఆర్ , అతని కుమార్తె అయినటువంటి కవిత మధ్య ప్రధమ పోరు నడుస్తుంది అనే బాధలను చేస్తూ ఉంటే కొంత మంది హరీష్ రావు కు కూడా ఆ సత్తా ఉంది అనే ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. ఏదేమైనా కూడా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను స్వీకరించేది ఎవరు ..? పార్టీని పటిష్టంగా ముందుకు నడిపేది ఎవరు అనే చర్చ చాలా మంది లో నడుస్తూనే ఉంది. మరి కేసీఆర్ తర్వాత ఈ పార్టీ బాధ్యతలను ఎవరు చేపడతారో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: