రేవంత్‌ రెడ్డి పాలన..మరో 10 ఏళ్లు కాంగ్రెస్‌ అంధకారంలోనే.. ?

Veldandi Saikiran
* మంత్రి కాకుండానే సీఎం అయిన రేవంత్‌
* చిన్న వయస్సులోనే కాంగ్రెస్‌ సీఎంగా గుర్తింపు
* హైడ్రా, మూసీ పేరుతో రచ్చ
* ఇలాగే పాలన కొనసాగితే.. కాంగ్రెస్‌ భూస్తాపితమే


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అనేక సంచలనాలు  జరుగుతున్నాయి. అసలు ప్రజలు ఎక్కడ కూడా.. సంతోషంగా లేరని చెబుతున్నారు చాలామంది జనాలు. దీని అంతటికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు అని మీడియా ముందే చెప్పేస్తున్నారు జనాలు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని.. వ్యక్తపరచడం గమనార్హం. వాస్తవంగా 6 గ్యారంటీ ల పేరుతో... తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.

గడిచిన 10 సంవత్సరాలలో కెసిఆర్ పాలనలో..  కొన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. దానికి తోడు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనపై జనాలు విసిగిపోయారు. ఒక్కసారి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా.. అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత... కేసీఆర్ ఉంటేనే బాగుండు.. ముసలోడైనా బాగా చేశాడు... అనే నినాదం తెరపైకి వస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం కృప రాదా పనులే  అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హైడ్రా పేరుతో రచ్చ చేయడం, మూసి పరివాహక సుందరీకరణ పేరుతో ఇండ్లను కూల్చడం...  రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో మచ్చగా మారిపోయాయి. జనాలు.. నోరు తో పలకలేని బూతులను తిడుతున్నారు. అటు రైతులకు రుణమాఫీ అలాగే రైతు బీమా కూడా అందించడం లేదు రేవంత్ రెడ్డి.

రేషన్ కార్డులు ఇస్తానని 9 నెలలు కాలం గడిపారు. రుణమాఫీ విషయంలో... 25 శాతం మంది రైతులకు చేసి చేతులు దులుపుకున్నారు. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి లా చేస్తానని... రేవంత్ రెడ్డి బొక్క బోర్ల పడుతున్నాడు. ఇకనైనా రేవంత్ రెడ్డి... ప్రజలు ఏం కోరుకుంటున్నారో... ఆ పనులు చేస్తే సక్సెస్ అవుతాడని... అంటున్నారు విశ్లేషకులు. వైయస్ రాజశేఖర్ రెడ్డి లా... రైతుల కోసం అలాగే పేద ప్రజల కోసం పాలన చేయాలని అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోవడం గ్యారంటీ అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: