గ్రేట్.. ఆ విషయంలో ప్రతి పక్షాలను నోరు మెదపకుండా చేసిన రేవంత్ రెడ్డి?

Chakravarthi Kalyan

రేవంత్ ట్విస్టు దెబ్బకి ప్రతిపక్షాలు బిత్తరపోయాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు ప్రతిపక్షాల దగ్గర నుంచి సమాధానమే లేకుండా పోయింది. ఇంతకీ విషయం ఏంటంటే. మూసీ రివర్ ప్రాజెక్టు డెవలప్ మెంట్ కు సంబంధించి ఎంత రచ్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై ప్రతిపక్ష బీజేపీతో పాటు బీజేపీ కూడా తోడై ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసింది.


ఇదే క్రమంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. మూసీ ముంపు బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో చెప్పాలని ప్రతిపక్షాలను కోరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏం చేద్దాం? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయం ఏంటి? ఇళ్లు కట్టిద్దామా? మూసీని అలాగే వదిలేసి మూసేద్దామా? చర్చకు వచ్చి సలహాలు  సూచనలు ఇవ్వాలని ఈటల రాజేందర్, కేటీఆర్, హరీశ్ రావులను రేవంత్ రెడ్డి కోరారు.


మూసీ నది ప్రాంతంలో ఎవర్నీ నిర్వాసితులను చేయమని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేవలం తమ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్షాల నేతలు కవచంలా మూసీ బాధితులను అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు. బాధితులు ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.


పేదల కష్టాలు, కన్నీళ్లు తెలియకుండానే తాను సీఎం అయ్యానా అని ప్రతిపక్షాలను నిలదీశారు. మూసీ ప్రాంతంలో ఉండే నివాసితులను ఖాళీ చేయిస్తే బాధపడతారు అని తనకు తెలీదా అని ధ్వజమెత్తారు. నదికి వరద వచ్చినప్పుడు ఇళ్లు కూలిపోయి, ప్రాణాలు కోల్పోతే ప్రతిపక్షాలకు బాగుంటుందా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో నిర్వాసితుల్లో ఎలాంటి నష్టం,కష్టం రాకూడదు అనే డిసైడ్ అయ్యే బాధితులకు వేర్వేరు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ నదిలోని నీళ్లన్ని విషమయం అయిందన్న విషయం అందరికీ తెలిసిందేన్నారు. మొత్తం మీద మూసీ, హైడ్రాపై రేవంత్ చేసిన కౌంటర్ ఎటాక్ కి ప్రతిపక్షాల నుంచి సమాధానం రావడం లేదు. ఇది వారికి కోలుకోలేని దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: