తెలంగాణ బీఆర్ఎస్ ప్రైవేటు ప్రాపర్టీనా... అది కల్వకుంట్ల ఫ్యామిలీ సొత్తా..?
అసలు అభివృద్ధిలో ప్రతిపక్షాలను కలుపుకుని పోవడం తప్పేమీ కాదు. ప్రతిపక్షాల కంటే ముందు.. ప్రాజెక్టు వల్ల ప్రభావితం అయ్యే ప్రజలను ఒప్పించడం కీలకం. అలా చేస్తే ఏ పార్టీతోను సంబంధం ఉండదు. ప్రభుత్వం తాను అనుకున్న పని సాఫీగా చేసుకుని పోవచ్చు. కానీ.. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిపనికి బీఆర్ఎస్ పదేపదే అడ్డు తగులుతుంది. అధికారం పోయినా కూడా బిఆర్ఎస్ తెలంగాణ.. తమ ప్రైవేటు ప్రాపర్టీ అని దీన్ని బలవంతంగా ఎవరో లాక్కున్నారు అన్న చందంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజులు నుంచే గోలగోల చేయటం మొదలుపెట్టింది. ప్రజలు కూడా బీఆర్ఎస్‌ను చీదరించుకునే పరిస్థితి వచ్చింది.
తెలంగాణ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీ సొత్తు అన్నట్టుగా బిఆర్ఎస్ వాళ్లు రగడ రగడ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ దూకుడు ముందు వెలవెలబోతుంది అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది. బిఆర్ఎస్ దూకుడు చూస్తుంటే పలు విషయాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదురుగా దాడి చేసేది పోయి.. డిఫెన్స్ లో పడిపోతున్న పరిస్థితి.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరైన సమన్వయంతో పాటు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే.. రాజకీయంగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందన్న చర్చలు అయితే తెలుగు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అటు తెలంగాణ అనేది తమకు మాత్రమే సొంతం. తమ పార్టీ సొత్తు అన్నట్టుగా బి.ఆర్ఎస్ దూకుడుగా రాజకీయం చేస్తుంటే.. కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి సరైన కౌంటర్లు కూడా లేవు.