ఏపీ: కూటమి కుంపట్లో.. సూపర్ సిక్స్ హామీలు.. సాధ్యమయ్యేవి అవేనా..?
ముఖ్యంగా స్కూలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి పిల్లలకు ఏర్పడడంతో పాటుగా నిత్యవసర ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. గతంలో ప్రభుత్వం నుంచి అందే పథకాల వల్ల చాలామంది వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇస్తామని ప్రకటించిన చేయలేకపోవడంతో కూటమి ప్రభుత్వానికి ఇవి కుంపటిలా మారుతున్నాయి. అయితే గత నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రతిపాదించిన మెజార్టీ ప్రజలకు దీనివల్ల ఎలాంటి లాభం లేదట.
ఎక్కువ మెజారిటీ లబ్ధి పొందాలి అంటే తల్లికి వందనం (ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది), 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ప్రతినెల ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా 20వేల రూపాయలు ఇస్తే చాలని విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారట. అయితే ఈ మూడు కూడా సాధ్యం కానీ హామీలనే విధంగా మరికొంతమంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే 50 ఏళ్లకే పింఛన్ వ్యవహారం కూడా సాధ్యం కాదనే విధంగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ సీఎం చంద్రబాబు చేయగలిగితే ఈ నాలుగు హామీలు చేస్తే తిరిగి మళ్ళీ అధికారం చేపట్టవచ్చు.. మరి రాబోయే రోజుల్లో ఈ వైఫ్ గా అడుగులు వేస్తారేమో చూడాలి