లోకేష్ అపాయింట్‌మెంట్‌కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే... !

RAMAKRISHNA S.S.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటు పార్టీలోని సగానికి పైగా భారాన్ని నారా లోకేష్ మోస్తున్నారు. ఇప్పుడు పార్టీలో బాధ్యతలు ఎక్కువగా లోకేష్ తీసుకుంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్ళపాటు లోకేష్ మంత్రిగా కూడా ఉన్నారు. మధ్యలో ఐదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో లోకేష్ చాలా బాగా రాటు దేలారు. పార్టీలో బాగా ప‌ట్టు పెంచుకున్నారు. అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్నారు. సీనియర్లకు బదులుగా యువకులకు, జూనియర్లకు ప్రోత్సాహాలు ఇస్తున్నారు.

యువగళం పేరుతో చేసిన పాదయాత్ర వల్ల ఆయనకు రాష్ట్రం అంతటా పార్టీ పరంగా ఎక్కడ ఎవరు ఎలా పనిచేస్తున్నారు..? ఎవరి సమర్థత ఏంటి..? అన్నదానిపై నేతలతో డైరెక్ట్ గా కనెక్షన్ ఏర్పడింది. ఇక లోకేష్ పార్టీకి బాగా అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లోకేష్ ను కలవాలి అన్న ఇది ప్రతి ఒక్కరిలో ఎక్కువగా కలుగుతుంది. లోకేష్ ను కలిసి తమ సమస్య చెప్పుకుంటే ఎవరిని నిరుత్సాహపరచరు అని తమ్ముళ్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఒకప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు చూసిన నేతలు అందరూ.. ఇప్పుడు ఆయన బాగా బిజీగా ఉండడంతో తమ సాధకబాధకాలు చెప్పుకునేందుకు.. తమ పనుల కోసం.. తమ నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కోసం.. లోకేష్ అపాయింట్మెంట్ కోసం ఎగబడుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో లోకేష్ కేంద్రంగా మారారు. చంద్రబాబు సైతం ఎక్కువ బాధ్యతలను లోకేష్‌కు అప్పజెప్పడంతో అందరూ లోకేష్ దగ్గరకు క్యూక‌డుతున్న పరిస్థితి.

ఏపీలో 100కు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో 20 దాకా భర్తీ చేశారు. మరో 80 దాకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది లోకేష్‌ను కలిసి పదవుల కోసం తమ పేర్లు పరిశీలించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబును కలిసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపటం లేదు. అందరూ లొకేష్ వెంట పడుతూ ఉండడంతో.. లోకేష్ అపాయింట్మెంట్ అనేది క్రేజీగా మారింది.
[10:25 am, 7/10/2024] V Subhash:

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: