బతుకమ్మతో రేవంత్ ఆటలు..నీ కంటే నిజాం రాజే బెటర్ ?
ప్రతి గ్రామంలో చాలా ఆనందంగా పండుగ జరుపుకునేవారు. కానీ ఈసారి కాంగ్రెస్ సర్కార్ ఉన్న నేపథ్యంలో బతుకమ్మ పండుగను పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. గతంలో కోట్లల్లో డబ్బులు.. ఖర్చుపెట్టి బతుకమ్మను అధికారికంగా నిర్వహించేవారు.బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి బతుకమ్మ చీరలతో పాటు బతుకమ్మ పండుగ కూడా... నిధులు సరిగా విడుదల చేయలేదు రేవంత్ రెడ్డి సర్కార్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12400 గ్రామాలు ఉంటే... ఆ గ్రామాలకు కేవలం 162 కోట్లు బతుకమ్మ పండుగ కోసం విడుదల చేశారు. అంటే ఒక్కో గ్రామానికి 13వేల రూపాయలు ఖర్చు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. కానీ గ్రామ సర్పంచ్లు మాత్రం బతుకమ్మ పండుగ నిర్వహించాలంటే కనీసం 50 వేల రూపాయలు ఎక్కువ గ్రామపంచాయతీకి ఉండాలని... చెబుతున్నారు. గతంలో ఒక్కో గ్రామపంచాయతీకి 50వేల పైన డబ్బులు సాంక్షన్ అయ్యేవి అని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. అలాగే బతుకమ్మ గాట్లు బ్లీచింగ్ పౌడర్ కు కూడా డబ్బులు విడుదల చేయడం లేదని మండిపడుతున్నారు.
అటు మహిళలు కూడా బతుకమ్మ చీరలు ఏవని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏరి కోరి తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చుక్కలు చూపిస్తోందని కొంతమంది మండిపడుతున్నారు. బతుకమ్మ పండుగ తో అటు తెలంగాణ విగ్రహం పట్ల కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాగే వ్యవహరిస్తోంది. తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ విగ్రహం పెట్టాల్సింది పోయి... రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి.. మరో వివాదానికి దారి తీసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం... కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ వాదులు కూడా అంటున్నారు.