ఏంటి బాబోరు: కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే 23 కోట్లా?
దీంతో ఏపీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. అయితే ఏపీ లో వరద బీభత్సం సృష్టించిన నేపథ్యంలో చాలామంది ప్రముఖులు, టాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, సంఘసంస్కర్తలు ఇలా చాలామంది.. ఏపీ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవాలని కూడా... భారీ స్థాయిలో చెక్కులు ఇచ్చి మరి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కోటి రూపాయలకు పైగానే... విరాళాలు ఇవ్వడం జరిగింది.
అయితే ఆ విరాళాలను ఏపీ ప్రభుత్వం.. సద్వినియోగం చేసుకొని విజయవాడ వరద బాధితులను ఆదుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసిపి.. ఈ అంశంపై సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. విరాళాలలో అవినీతి జరిగిందని.. ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదని వైసిపి పార్టీ యంగ్ లీడర్.. దేవినేని అవినాష్ తాజాగా ఆరోపణలు చేయడం జరిగింది. వరద బాధితుల కోసం ఇచ్చిన విరాళాలన్నీ కూటమి నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆయన ఆరోపణలు చేశారు.
కోట్లల్లో డబ్బులు వస్తే... చంద్రబాబు కూటమి ప్రభుత్వం మింగేసిందని.. ప్రజలకు సరైన మంచినీటి సౌకర్యాన్ని కూడా అందించలేదని ఆగ్రహించారు. కొవ్వొత్తులు అలాగే అగ్గిపెట్టలకే... 23 కోట్లు ఖర్చు చేశామని కూటమి సర్కార్... భారీ స్కాం కు తెరలేపిందని ఆయన ఆరోపణలు చేయడం జరిగింది.దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరాళాల పైన కొత్త చర్చ మొదలైంది. మరి YCP చేసిన ఆరోపణలపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.