30 జిల్లాలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న‌.. కొత్త జిల్లాల్లో అదిరిపోయే ట్విస్టులు...!

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .
రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇష్టం వచ్చినట్టు తెలంగాణను విభజించి.. జిల్లాలు, జిల్లాలుగా చేసేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏకంగా 33 జిల్లాలు అవతరించాయి. ములుగు, సిరిసిల్ల, వనపర్తి లాంటి చిన్న జిల్లాలు సైతం కేసీఆర్ ఏర్పాటు చేసి తెలంగాణను ఇష్టం వచ్చినట్టు మొక్కలు చెక్కలు చేసేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. అప్పటివరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చడంతో పాటు.. మన్యంలో పార్వతీపురం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి.

వైసీపీ హయంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాల కు అసలు హెడ్ క్వార్టర్స్ . . ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అల్లూరు సీతారామ రాజు జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పులను సరిచేస్తామని ప్రకటించారు. విభ‌జ‌న కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం 30 జిల్లాలు గా అవతరించబోతుందని తెలుస్తోంది.

తాజాగా పలాస, నాగావళి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామం, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్టు డ్రాప్ బయటకు వచ్చేసింది. జగన్ జిల్లాలను మార్చారు కానీ.. ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువగా పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందని జగన్ చేతులు దులుపుకున్నారు. కానీ.. ఉద్యోగులు, ప్రజలకు ముప్పుతెప్పలు తప్పడం లేదు. ఈ తప్పులు అన్ని చంద్రబాబు స‌రి చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: