నూజివీడు వీణలకు పూర్వ వైభవం.. నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల?
దీంతో ఇక వీణ తయారీ కళ భవిష్యత్తులో అంతరించిపోతుంది. ఇక పుస్తకాలకు పరిమితమవుతుందని ఎంతోమంది వీణ తయారీ కళాకారులు ఆందోళనలో మునిగిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎంతోమంది వీణ తయారీ వృత్తిని వదిలిపెట్టుకోగా.. ఇంకొంతమంది కులవృత్తిపై మమకారం చంపుకోలేక ఇంకా నమ్ముకున్న వృత్తిని అతి కష్టం మీద కొనసాగిస్తున్నారు. అయితే ఇక ఎంతో ప్రఖ్యాతిగాంచిన నూజివీడులో వీణ అంతరించిపోతున్న కలగా భావించి భావితరాలకు అందించాలి అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి.
ఈ క్రమంలోనే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో వీణల తయారీలో ఐదు నెలల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. వారికి ముడి సరుకు తో పాటు శిక్షణ కాలంలో ₹7,500 కూడా ఇవ్వడం జరుగుతుంది. తుక్కులూరు గ్రామంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాండీ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ ప్రమోషన్ ఆఫీసర్ రవీంద్ర ఈ గొప్ప కార్యక్రమం చేపట్టేందుకు ముందుకు వచ్చారు. చేతివృత్తుల్లో ప్రాచీన కలల్లో ఈ వీణ తయారీ ఒకటి. అందుకే వీణల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు అయితేవీణల తయారీలో నిష్ఠాత్తుడు అయినా షేక్ మాబు నివాసం వద్ద శిక్షణ శిబిరం ప్రారంభమవుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి వీణ తయారు శిక్షణ శిబిరం ప్రారంభించాలని కలలుగన్న షేక్ మాబు కల ఇన్నాళ్ల తర్వాత నెరవేరేబోతుంది. స్టై అండ్ కూడా ఇస్తూ ఉండడంతో ఎంతోమంది యువకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.