కాశ్మీర్‌లో బీజేపీకి గట్టి షాక్.. మోదీశకం ముగింపుకు సంకేతాలా?
ఆర్టికల్ 370 రద్దు వివాదం:
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం. దీని కోసం ఎన్నో ఏళ్లుగా వ్యూహం కూడా పన్నింది. అలా ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఫలితంగా కశ్మీర్ రాష్ట్రం హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. తర్వాత తొలిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జనరల్ గా పాకిస్థాన్ కబంధ హస్తాల్లోనూ..వేర్పాటు వాద శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్న కశ్మీర్ ను పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకునేలా..పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మాదే అని పార్లమెంటులో గర్జించిన అమిత్ షా కామెంట్స్ కు దేశభక్తి తో ఉప్పొంగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలి కదా. అందుకే ఈసారి పీడీపీతో కూడా పనిలేకుండా సింగిల్‌గా బరిలోకి దిగింది. కానీ ఈరోజు వచ్చిన రిజల్ట్ బీజేపీకి షాక్ ఇచ్చింది. అక్కడ ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ వైపే మొగ్గు చూపి అధికారాన్ని కట్టబెట్టారు.
ప్రజలపై అణిచివేత:
ఇక జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఉగ్రవాదం వేర్పాటువాదలు వంటి వారిపై బీజేపీ చర్యలు చేపట్టడం ప్రారంభించింది. దాన్ని అక్కడ ప్రజల కూడా స్వాగతించారు. కానీ తమ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచి వేస్తున్నారని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యతిరేకత కూడా వచ్చాయి. దీంతో ఇది బీజేపీకి పెద్ద మైనస్ గా మారింది.. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు అయినప్పటికీ కూడా ఉగ్రదాడులను బిజెపి పూర్తిగా అరికట్టలేకపోయింది.
సీఎంగా ఒమార్ అబ్దుల్లా ?
ఇక దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ వైపే జమ్మూ కాశ్మీర్ ప్రజల మొగ్గుచూపి అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారుఖ్ అబ్దుల్లా కొడుకు ఒమార్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ కు కాబోయే సీఎం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక గతంలో కూడా ఈయన జమ్మూ కాశ్మీర్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది.