ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త.. కొత్త రేషన్ కార్డుల జారీ అప్పుడేనా?
త్వరలో జరగనున్న కేబినేట్ మీటింగ్ లో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్డీఏ సర్కార్ గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలిపెట్టిన బకాయిలను ఇప్పటికే చెల్లించింది.
తొలి విడతగా 1000 కోట్ల రూపాయలు, తర్వాత విడతలో మిగిలిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమ చేయడం గమనార్హం. వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ విషయంలో సైతం ఏపీ సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశంలో దీని గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితిని పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల చేర్పు, కుటుంబ సభ్యుల తొలగింపు, చిరునామా మార్పు, కార్డులను సరెండర్ చేయడం చేయబోతుందని తెలుస్తోంది. ఏపీలో కొత్త రేషన్ కార్డ్స్ దిశగా అడుగులు పడటం అంటే ప్రజలకు ఎంతో శుభవార్త అనే చెప్పాలి. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త రేషన్ కార్డుల వల్ల గతంలో కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డును పొందలేని వాళ్లు సైతం కార్డును పొందే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.