రతన్ టాటా బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణం వల్ల చాలా మంది తీవ్ర బాధ వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా టాటా కంపెనీని చాలా గ్లోబల్ రేంజ్ లో డెవలప్ చేశారు. ఆయన తర్వాత ఈ కంపెనీని ఎవరు నడిపిస్తారో అనేది ప్రతి ఒక్కరికీ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే రతన్ టాటా గారికి పిల్లలు లేరు కదా! టాటా కంపెనీ చాలా వివిధ దేశాల్లో చాలా రంగాల్లో విస్తరించింది. కార్లు, విమానాలు, కమ్యూనికేషన్స్, హోటళ్లు ఇలా చాలా రకాల వ్యాపారాలు టాటా కంపెనీకి ఉన్నాయి.
రతన్ టాటా గారు కంపెనీని చాలా ఏళ్ళు నడిపించారు. ఆయన తర్వాత ఎన్. చంద్రశేఖరన్ అనే వ్యక్తి కంపెనీని నడిపిస్తున్నారు. కానీ చాలామంది, భవిష్యత్తులో టాటా కుటుంబం నుంచి ఎవరైనా ఈ కంపెనీని నడిపిస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం, నోయెల్ టాటా అనే వ్యక్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన రతన్ టాటాకి సవతి సోదరుడు అవుతారు.నోయెల్ టాటా చాలా కాలంగా టాటా గ్రూప్‌లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా, టాటా గ్రూప్‌లోని ట్రెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ చాలా బాగా చూసుకుంటున్నారు. నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు మాయ, నెవిల్లే, లేహ్. వీరందరూ కూడా టాటా గ్రూప్‌లో పనిచేస్తున్నారు. మాయ టాటా కొత్త ప్రాజెక్టులను చూసుకుంటుంది. టాటా న్యూ అనే యాప్‌ను ప్లాన్ చేసింది ఆమే. నెవిల్లే టాటా దుకాణాల వ్యాపారాన్ని చూసుకుంటాడు. లేహ్ టాటా హోటళ్ల వ్యాపారాన్ని చూసుకుంటుంది. అంటే, నోయెల్ టాటా కుటుంబం మొత్తం టాటా గ్రూప్‌లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
చాలామంది అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో టాటా గ్రూప్‌ను నడిపించే బాధ్యత నోయెల్ టాటా లేదా ఆయన పిల్లలకే వస్తుంది. ఎందుకంటే వీరందరూ టాటా గ్రూప్‌లో చాలా అనుభవం ఉన్నారు. అంతేకాకుండా, వీరు కంపెనీని ఎలా నడిపించాలో చాలా బాగా తెలుసు. నోయెల్ టాటా, వారి పిల్లలు టాటా గ్రూప్ బాధ్యతలను చేపడితే వ్యాపార విలువలు సోషల్ రెస్పాన్సిబిలిటీ మెరుగైన స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. రతన్ టాటా కోటీశ్వరుడైనా పేదవాళ్ల కోసం ఎన్నో మెరుగైన ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. సమాజానికి ఎంతో మంచి చేశారు. నోయెల్ టాటా కుటుంబం కూడా అలాగే చేస్తారు అని అందరూ నమ్ముతున్నారు.