టాటా గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత రతన్ టాటా నిన్న రాత్రి అనారోగ్య కారణంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ మృతి చెందారు. రాత్రి 11.30 నిమిషాలకు కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న భారతీయులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే., రతన్ టాటా మృతి చెందినట్టు అధికారికంగా ధృవీకరణ చేసిన అనంతరం మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అక్కడికి చేరుకొని నివాళ్లు అర్పించారు. ఈ తరుణంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆగనేతకు నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
నేడు (గురువారం) ఆ రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఇక రతన్ టాటా అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రతన్ టాటా మృతదేహం అభిమానులు, సామాన్య ప్రజలు సందర్శన కోసం ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ లో ఉంచుతున్నట్లు తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నం మధ్యాహ్నం 3.30 సమయంలో అంతిమ యాత్ర ప్రారంభం చేస్తామని, సాయంత్రం సమయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేయబోతున్నట్లు సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపాడు. ఇక రతన్ టాటా మృతి పై భారతదేశ ప్రజలు అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రముఖులు, రాజకీయ నేతలు అందరూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
నేడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఎలాంటి వినోద కార్యక్రమాలు జరగవు . అలాగే ముంబైలోని వర్లీ ప్రాంతంలో నేడు ఆయన అంత్యక్రియలు చేయబోతున్నారు.ఈ తరుణంలో మహారాష్ట్ర సీఎంతో పాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా రాష్ట్రంలో ఒకరోజు సంతాప దినాలు తెలిపినట్టు సమాచారం. అయితే జార్ఖండ్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును అందించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మవిభూషణ్ రతన్ టాటా మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటించారు’ అని సోషల్ మీడియాలో తెలిపారు.