బాలయ్యకు ఎదురు దెబ్బ..హిందూపురంలో కూటమి స్పీడ్ కు బ్రేకులు ?
అయితే... హిందూపురం నియోజకవర్గం లో చక్రం తిప్పిన వైసిపి నేతలు... ఇటీవల టిడిపిలో చేరిన కౌన్సిలర్లను వెనక్కి తెచ్చుకున్నారు. తాజాగా నలుగురు కౌన్సిలర్లు.. టిడిపి నుంచి.. బయటకు వచ్చి వైసిపి కండువా మళ్ళీ కప్పుకున్నారు. అంతేకాదు టిడిపి నుంచి బయటికి వచ్చిన ఆ నలుగురు కౌన్సిలర్లు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి... పార్టీ కోసం కష్టపడతామని హామీ ఇచ్చారు. ఇకపై వైసీపీ పార్టీని వీడబోమని కూడా ప్రకటించారు... ఆ కౌన్సిలర్లు.
తెలుగుదేశం కూటమి పార్టీ నేతలు ప్రలోభాలు అలాగే బెదిరింపులకు... పాల్పడడంతో తాము పార్టీ మారినట్లు వివరించారు. లేకపోతే మేము ఆ పార్టీలోకి వెళ్ళేది కాదని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇకపై వైయస్ జగన్మోహన్ రెడ్డి... వెంట నడుస్తామని నలుగురు కౌన్సిలర్లు ప్రతిజ్ఞ కూడా చేశారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురం మున్సిపాలిటీలో... టిడిపి జెండా ఎగరవేయాలని అనుకున్నారు.
ఇందులో భాగంగానే... వైసీపీ లీడర్లను లాగేసుకున్నారు. పరశురాముడు, మల్లికార్జున, రహమద్ బి అలాగే మనీ లాంటి నేతలు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పి మొన్న టిడిపిలో చేరారు. అయితే మళ్లీ... వైసిపి నేతలు చక్రం తిప్పడంతో... ఆ నలుగురు నేతలు సొంత గూటికి చేరుకున్నారు. దీంతో హిందూపురంలో బాలకృష్ణకు... ఊహించని ఎదురు దెబ్బ తగిలిందని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.వైసిపికి చెడు చేద్దామని చూసిన కూటమి ప్రభుత్వానికి భగవంతుడే... శిక్ష వేశాడని వైసీపీ నేతలు చెబుతున్నారు.