ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త .. భారీగా గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయింపు..!
గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల..
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి నది పుష్కరాలు .. 2027లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే గోదావరి పుష్కరాల సన్నాహాలు మొదలు పెట్టింది . ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త ను అందించింది .. రాబోయే గోదావరి నది పుష్కరాలకు రూ , 100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది . 2027 గోదావరి నాది పురస్కారా లను పుష్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధుల ను కేటాయించింది . పుష్కరాల సన్నహాల దిశగా టూరిజం శాఖ అధికారులు త్వరలో నే పనులు కూడా మొదలు పెట్టనున్నారు . ఎన్డీఏ ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వాని కి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తూ వస్తుంది .
అలాగే మొన్న వచ్చిన కేంద్ర బడ్జెట్ల ను ఏపీకి కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిన .. సీఎం చంద్రబాబు కోరిన మేరకు నిధులు మంజూరు చేస్తున్నారు కేంద్ర పెద్దలు . ఇక ఇప్పటికే ఏపీకి పలు కొత్త రైల్వే , జాతీయ రహదారులు , ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు లను . పీఎం ఆవాస్ యోజన ఇల్లును కూడా మంజూరు చేశారు . ఇక ఇప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ . 100 కోట్ల కు పైగా నిదలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం .. తెలంగాణలోని గోదావరి పుష్కరాల కు ఏమైనా నిధులు మంజూరు చేస్తుందో లేదో కూడా చూడాలి . మరో వైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన వరదల విపత్తుకు ఆంధ్రప్రదేశ్లో అధికంగా నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకునేందుకు వరద సాయం కింద రూ. 7,600 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే కేవలం రూ. వెయ్యి కోట్లు విడుదల చేసింది. ఆ విమర్శలను తప్పించుకోవడానికే గోదావరి పుష్యకరాల నేపంతో నిధులు విడుదల చేసిందని కూడా అంటున్నారు.