కేబినెట్ మీటింగ్ కు గైర్హాజరైన డిప్యూటీ సీఎం..అసలు కారణం అదే..!

FARMANULLA SHAIK
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లో సమావేశం కొనసాగుతోంది. రతన్ టాటా  మృతి కి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది.సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు నివాళులర్పించారు.అలాగే అమరావతి, పోలవరం నిర్మాణాల పై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు పై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ఇటీవల మచిలీపట్నం లో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దు పై కూడా ఈ సమావేశం లో చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.ఇదిలా వుండగా ఇవాళ క్యాబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు.

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జలుబు, జ్వరం, తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్న ఆయన..గురువారం ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ కారణంగానే ఇవాళ్టి కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా వుండగా ఈ క్యాబినేట్ సమావేశం లో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ఆలయాల్లో అర్చకులకు విస్తృతాధికారులు కట్టబెట్టినట్లైంది. ఇక ఈ జీవో ప్రకారం.. దేవదాయ కమిషనర్ సహా ఏ స్ఖాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి  అర్చకులకు వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: