90 % మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి... ఇదిగో లెక్కలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల కిందట తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి... ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎన్నికల కంటే ముందు అనేక రకాల హామీలను కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల కంటే... జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన టార్గెట్ ఎక్కువగా చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం కూటమిని ఎదుర్కొనేందుకు... వైసీపీ పార్టీ అనేక వ్యూహరచనలు చేస్తోంది.ఇందులో భాగంగానే తిరుమల లడ్డు వ్యవహారం, సెవెన్ గ్యారంటీలు, క్రైమ్ రేట్ పెరగడాన్ని... ఎత్తి చూపిస్తూ వైసిపి కౌంటర్ ఇస్తూనే ఉంది. ముఖ్యంగా విజయవాడ వరద బాధితుల కోసం ఇచ్చిన విరాళాలు కూడా తినేసారని తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది వైసిపి. విరాళాల డబ్బులను... తెలుగుదేశం కూటమి నేతలు జేబులో వేసుకున్నారని కూడా మండిపడుతోంది.
ఇలాంటి నేపథ్యంలో... గత వారం రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు రాజ్యసభ వైసిపి సభ్యులు విజయసాయిరెడ్డి. ఆయన.. రోజుకో పోస్టు పెట్టి చంద్రబాబును వనికిస్తున్నారు. హర్యానాలో బిజెపి గెలవడం పై కూడా కుట్రలు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. ఇక లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొన్న గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలలో 90 శాతం మంది అవినీతికి పాల్పడ్డారని... ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. విరాళాలే కాకుండా ఇసుక దందాలో కూడా విపరీతంగా సంపాదిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు తాజాగా.. మద్యం పాలసీ తో కూడా టిడిపి ఎమ్మెల్యేలు దండుకుంటున్నారని... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలిసే జరుగుతోందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరి విజయ సాయిరెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలపై చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.