చంద్రబాబు కూటమి సర్కార్ ను టార్గెట్ చేసి.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. రేపల్లె వైసీపీ నేతల సమావేశంలో మోపిదేవి పై రాజీనామా పై వైఎస్ జగన్ స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పార్టీని వీడి మోపిదేవి వెంకట రమణ వెళ్లిపోవడం బాధాకరమని చెప్పుకు రావడం జరిగింది. మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. ఏ రోజైనా మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామని...గుర్తు చేసుకున్నారు జగన్.
తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చామని పేర్కొన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. మండలిని రద్దుచేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవిపోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపామని వివరించారు. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత మన పార్టీదని తెలిపారు. ఇప్పుడు గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరమన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.
తనకు కష్టాలు కొత్తేమీ కాదని... రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని ఎంతో ఎమోషనల్ అయ్యారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. మా నాన్న ముఖ్యమంత్రి అయినా... కష్టాలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. పెద్ద వాళ్లంతా ఏకమయ్యారు, తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. 16 నెలలు జైల్లో పెట్టారు, వేధించారని అయినా.. తట్టుకున్నాని చెప్పుకొచ్చారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.
అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించలేదా అని పేర్కొన్నారు. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. ప్రజలను అబద్ధాలతో మోసం చేశారని ఆగ్రహించారు. మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నీ చేసిన మనకే ఇలా అయితే, ప్రజలను ఇంతలా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారని చురకలు అంటించారు. చంద్రబాబుకు సింగిల్ డిజిట్‌కూడా ఇవ్వరని హెచ్చరించారు.