పవన్ కళ్యాణ్‌ కు షాక్‌..జగన్‌ కు జనసేన ఎమ్మెల్యే మద్దతు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా తయారవుతుంది. ఎప్పుడు ఆ పార్టీ నేతలకు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికి అదే టెన్షన్ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీకి చెందిన ఎంపీలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారట. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలను కాకుండా రాజ్యసభ సభ్యులను చంద్రబాబు టార్గెట్ చేశారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి బయటకు వెళ్లారు. మరికొంతమంది రాజ్యసభ సభ్యులను వారి వద్దకు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఇక అటు రెడ్ బుక్ ప్రకారం వైసిపి నేతలపై కేసులు కూడా పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా.... ఈ మధ్యకాలంలో లోకేష్ రెడ్ బుక్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు జగన్. లోకేష్ రెడ్ బుక్ ఏమీ లేదని తేల్చి చెప్పిన జగన్ తాము గుడ్ బుక్ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

గుడ్ బుక్ అంటే అందులో తమ పార్టీ కోసం పనిచేస్తున్న నేతల పేర్లు రాసుకుంటామని, వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని తెలియజేశారు. దీంతో వైసీపీతో పాటు కూటమి పార్టీలోనూ సానుకూల స్పందన వస్తుంది. బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి ఇప్పటికే ఈ గుడ్ బుక్ ను స్వాగతించగా.... ఇవాళ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా స్పందించాడు. వైయస్ జగన్ ఆలోచన చాలా బాగుందని మెచ్చుకున్నారు  జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

కానీ రాసేవాడు మంచివాడు అయ్యుండాలి కదా... అంటూ గుడ్ బుక్ గురించి తాజాగా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఓ పోస్ట్ ని సైతం షేర్ చేసుకున్నాడు. ఇందులో వైసిపి గుడ్ బుక్. ఇందులో మంచి వారి పేర్లు మాత్రమే ఉంటాయని జగన్ చెబుతూ చూపిస్తున్న ఫోటోను ఉంచారు. తద్వారా జగన్ గుడ్ బుక్ ఆలోచన మంచిదేనని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చెప్పినట్టు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: