తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు నంబర్ 12578 మైసూర్ -దర్భంగా మధ్య నడిచే భాగమతి ఎక్స్ ప్రెస్ చెన్నై డివిజన్ లోని తిరువళ్ళూరు సమీపంలోని కవరిపేటై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు, గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురవ్వగా.. రెండు బోగీలు పూర్తిగా తగలబడి పోతున్నట్టుగా తెలుస్తోంది. కాగా కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, స్థానికుల సహాయంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు రైల్వే అధికారులు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మరో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుమ్మిడిపూండి సమీపంలోని కవరపేటై వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టి ప్రభుశంకర్ తెలిపారు.
బోగీల్లో చిక్కుకున్నవారిని సహాయక సిబ్బంది బయటికి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ లు, రెస్క్యూ వాహనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా బస్సులు, తాగునీరు వంటి వసతులను సిద్దం చేసినట్లు తిరువళ్లూరు జిల్లా అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం కారణంగా నెల్లూరు-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు లో రైలు ప్రమాదం జరిగిన కవరైపెట్టెయి స్టేషన్ లో పరిస్థితి భయానకంగా వుంది. ఆగి గూడ్స్ రైలు ను భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ 100km వేగంతో ఢీకొట్టింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో లోకో పైలెట్ రైలును ముందుకు తీసుకెళ్లారని, అదే వేగంతో లూప్ లైన్ లో ఆగి వున్నా గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తంది.ప్యాసెంజర్ ట్రైన్ రెండు ఏసీ భోగిలతో సహా 6భోగిలు పట్టాలు తప్పాయి.పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.