ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆరోజే మెగా డీఎస్సీ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు మెగా డీఎస్సీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం చేస్తామని చెప్పి చేసినప్పటికీ ఇప్పటికీ వంద రోజులు అవుతున్న అందుకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటివలె ప్రకటించినట్లు సమాచారం. మొత్తం 16,430 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలియజేశారు. నవంబర్ 3వ తేదీన అందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ ప్రకటన కూడా చేయబోతున్నారట.

ప్రస్తుతం జరుగుతున్న టెక్ పరీక్షలు ఫలితాలు నవంబర్ రెండవ తేదీన రిలీజ్ కాబోతాయని ఆ తర్వాత మరుసటి రోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు విద్యాశాఖ తెలియజేశారు. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భర్తీ చేయబోతున్న ఈ మెగా డీఎస్సీలో ఎలాంటి న్యాయవివాదాలకు సైతం స్థానం ఇవ్వకుండా నియామక ప్రక్రియ కూడా పారదర్శకంగానే జరిగేలా చూస్తామంటూ నారా లోకేష్ వెల్లడించారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య కాస్త సమయం ఎక్కువగా ఉండాలని అందుకే పెట్టుకుడిఎస్సి కి ఒక్కో దానికి మూడు నెలలు చొప్పున గ్యాప్  ఇవ్వడానికి అభ్యర్థులకు అవకాశం ఇచ్చామని తెలుపుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు మానేసి మరి మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్నారని ఉద్యోగం ప్రకటన చేసిన ఆరు నెలలకు మించి ఆలస్యం అయితే కూడా అభ్యర్థులకు భారంగా మారుతుందని భావించే నవంబర్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేశామంటూ తెలుపుతోంది ఏపీ ప్రభుత్వం. డీఎస్సీ 2024 సిలబస్ విషయానికి వస్తే ఈ విషయం పైన కాస్త గంధాల ఘోరంగా ఉన్నప్పటికీ గత నోటిఫికేషన్ ప్రకారమే సిలబస్ ఉంటుందని అందులో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని తెలియజేశారు. ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటే తెలియజేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తానికి నవంబర్ మూడవ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: