జమిలి ఎన్నికల ఎఫెక్ట్.. చిరంజీవికి చంద్రబాబు మెగా ఆఫర్..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది .దీంతో చంద్రబాబు ఇప్పటినుంచి పలు రకాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూటమిని కూడా వచ్చే ఎన్నికలకు కూడా కొనసాగించేలా ప్లాన్ తోనే చంద్రబాబు ముందుకు వెళుతున్నారట. తాజా ఎన్నికలలో మెగ కుటుంబ సభ్యులతో ఫార్ములాని తీసుకు వెళ్లడం కూటమి గట్టెక్కడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి చిరంజీవి ముందుకు కూడా ఇలాంటి కీలకమైన ప్రతిపాదన తీసుకువచ్చినట్లు సమాచారం

ఇటీవల చిరంజీవి కూడా ముఖ్యమంత్రిని వరద బాధితులకు ఇవ్వవలసిన చెక్కును సైతం అందజేసేందుకు వెళ్ళగా.. అక్కడ మరొకసారి ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు మరొకసారి తమతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి మోడీ ప్రస్తావిస్తూ చేతులు పైకెత్తి మరి ఆనంద విషయాలు తెలిపారు. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమను ఏపీలో విస్తరింప  చేసేలా చేయడంతో పాటు టూరిజం డెవలప్మెంట్ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని చిరంజీవిని చంద్రబాబు కోరారట. గతంలో కూడా చిరంజీవి ఇలాంటి మంత్రి పదవిలో పనిచేశారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలలో బిజీగా ఉన్నారు గతంలో జగన్ సీఎం ఉన్న సమయంలో కూడా చిరంజీవి సినీ పరిశ్రమ నుంచి ఎన్నో వాటిని సాల్వ్ చేశారు. అయితే ఆ తర్వాత చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరిమితమై అటు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉన్నారు చిరంజీవి. మరి కూటమి వ్యవహారంలో చంద్రబాబు ఇచ్చిన ఈ మెగా ఆఫర్ కు చిరంజీవి ఏ విధంగా ఓకే చెబుతారో లేదో చూడాలి మరి. సింగల్ గా పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతామని కూటమి ప్రభుత్వం భావిస్తోంది కనుక ఇలా ఎన్నికలకు ముందే ప్రతిపాదనలు తీసుకువచ్చేలా చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: