కూటమిలో జనసేన మార్పు.. మరో చిచ్చు రగిలినట్టేనా..?

Divya
ప్రతి ఏడాది కూడా మహానగరం విశాఖపట్నంలో అధ్యాయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ ఇతర దేశాలకు వెళ్లి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని సైతం గమనించి అలాంటి వాటిని విశాఖలో అమలు చేసేందుకే ఇలాంటి యాత్రలు కొనసాగిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అవి ఏకంగా విహారయాత్రలుగా మారిపోతున్నాయని విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. విమానాలలో వెళ్లి దేశంలో పలు రకాల ప్రాంతాలలో బస చేసి అక్కడ ఖర్చులన్నీ కూడా GVMCమీద మోపడం వల్ల ఆర్థిక భారం రోజురోజుకి పెరుగుతోందట.

ప్రజలు కట్టే పన్నులతో వారికి మేలు చేయాల్సిన కార్యక్రమాలను వదిలేసి విహార యాత్రలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.. అందుకే ఈ యాత్రల వల్ల వల్ల ఒరిగేదేమి లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే వామపక్ష పార్టీలు ఈ యాత్రలకు ఎప్పుడు దూరంగానే ఉంటున్నారు. అయితే ఈసారి మాత్రం GVMC  కార్పొరేటర్లు దక్షిణ భారతదేశ యాత్రకు సైతం పైన మూగడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ యాత్రలో టిడిపి కూటమిలోని కీలక పార్టీ అయినా జనసేన పార్టీ మాత్రం వీటిని వ్యతిరేకిస్తున్నదట.

ఈ యాత్రల వల్ల లాభాలు ఏమీ లేదని అలాగే సిపిఎం కి చెందిన మరో కార్పొరేట్ యాత్రను కూడా ఆపివేయాలంటూ జీవీఎంసీ కమిషనర్కి ఒక లేఖను కూడా రాయడం జరిగిందట. GVMC లో ఉండేటువంటి 98వ వార్డులో  అసలు వీధి దీపాలే లేవని నాణ్యమైన రోడ్డు లేవని ఇలాంటి పరిస్థితులలో యాత్రలు చేయడం మంచిది కాదని సిపిఎంతో పాటు జనసేన కార్పొరేట్ నేతలు కూడా తెలియజేస్తున్నారు. యాత్రల పేరుతో చేసేటువంటి వాటిని బహిష్కరించాలని వారు తెలుపుతున్నారు. అయితే ఈ యాత్రలు చేసేందుకు పార్టీ నేతలు ముగ్గు చూపుతున్న... బిజెపి టిడిపి యాత్రకు ఓకే చెబుతున్న కూటమిలో జనసేన పార్టీ మాత్రం వీటిని విభేదిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: