వైసీపీకి బిగ్ షాక్... ఆ ఎమ్మెల్యే తిరిగి జనసేనలోకే జంప్..?
- వైసీపీ ని వరుస పెట్టి వీడుతోన్న కీలక నేతలు .. ?
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) . .
ఆంధ్రప్రదేశ్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వరుస పెట్టి తమ రాజకీయ భవిష్యత్తు కోసం కండువాలు మార్చేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఇలా కండువాలు మార్చడం కామన్ గా జరుగుతూ వస్తోంది. ఎన్నికల తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ... మాజీ ఎమ్మెల్యేలు ... జిల్లా పార్టీ అధ్యక్షులు ... చివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు సైతం టిడిపి లేదా జనసేనలోకి వెళ్లిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - బీద మస్తాన్ రావు ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా జనసేన తొలి ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు సైతం ఇప్పుడు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది జరిగిన ఎన్నికలను అమలాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిన వరప్రసాద్ రావు ఇప్పుడు తిరిగి తన సొంత పార్టీ అయిన జనసేన కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా రాపాక పార్టీ మారకుండా ఉండి ఉంటే ఆయనకే రాజోలు జనసేన టికెట్ దక్కేది. జనసేన పార్టీలో సీనియార్టీ కొట్టాలో ఆయన మంత్రి కూడా అయ్యేవారు. ఎప్పుడు అయితే వైసిపి చెంత చేరిపోయారో ? అప్పటినుంచి జనసేనకు ఆయన బద్ధ శత్రువు అయ్యారు. రాపాక వైసీపీకి దూరమైనా జనసేన ఆయనను అక్కున చేర్చుకుంటుందా ? రాజోలు జనసేన కేడర్ అంగీకరిస్తారా అన్నది చూడాలి.