దేశంలో ఈవీఎం పాలన నడుస్తోందా.. అనుమానాలకు జవాబులు చెప్పేదెవరు?

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్నికల ఫలితాల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలలో పొరపాటు జరగదని జరిగే అవకాశమే లేదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొంతమంది విశ్లేషకులు ఏకంగా దేశంలో ఈవీఎం పాలన నడుస్తోందా అనే అనుమనాలను వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ అనుమానాలకు జవాబులు చెప్పేదెవరనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమయ్యాయి. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామని చెబుతుండటం గమనార్హం. కొంతమంది టెక్ నిపుణులు ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం సాధ్యమవుతుందని తేల్చి చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 100 రోజుల పాటు వీవీ ప్యాట్లు భద్రంగా ఉండాలి.
 
కానీ వీవీ ప్యాట్లను భద్రంగా ఉంచకుండా కాల్చివేసిన పరిస్థితులు ఉండటం ఎన్నో అనుమానాలను తావిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ సైతం రాష్ట్రంలో తమ పార్టీకే కచ్చితంగా అధికారం దక్కి ఉండాలని అయితే ఈవీఎంలలో ఏదో మోసం జరిగిందని చెబుతుండటం కొసమెరుపు. ఈవీఎంలకు సంబంధించి ప్రజల్లో ఎన్నో అనుమానాలు నెలకొనగా ఆ అనుమానాలు నివృత్తి కాకపోతే ఇబ్బందేనని చెప్పవచ్చు.
 
ప్రజాస్వామ్యదేశమైన భారత్ లో ఈవీఎంలకు సంబంధించి నెలకొంటున్న అనుమానాలు భవిష్యత్తులో ప్రజలకు ఓటు విషయంలో అభిప్రాయాన్ని మార్చివేశే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈవీఎంల విషయంలో అనుమానాలు నిజమేనని ప్రూవ్ అయితే మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు అయితే తప్పవని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. ఈవీఎంలకు సంబంధించి వస్తున్న ఆరోపణల విషయంలో గెలిచిన పార్టీల నుంచి సరైన రియాక్షన్ లేదు.  తమకు పూర్తిస్థాయిలో అనుకూలమైన ప్రాంతాలలో సైతం గుర్తు తెలియని పార్టీల అభ్యర్థులు విజేతలుగా నిలుస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఈవీఎంలు ఉంటే తాము పోటీ చేయబోమని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: