కొండా సురేఖపై వేములవాడ రాజన్న కన్నెర్ర ?

Veldandi Saikiran
తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే 15 రోజుల్లో రెండు వివాదాల్లో ఇరుక్కున్న కొండా సురేఖ తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం జరిగింది. వేములవాడ రాజన్న సన్నిధికి వెళ్ళిన కొండా సురేఖ పై.. వేములవాడ రాజన్న కన్నెర్ర చేశాడు. అక్కడికి వచ్చిన మహిళా భక్తులు కొండా సురేఖ పై విరుచుకుపడ్డారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

దసరా పండుగ నేపథ్యంలో కుటుంబ సమేతంగా తాజాగా వేములవాడ రాజన్న సన్నిధికి కొండా సురేఖ దంపతులు వెళ్లడం జరిగింది. కొండా దంపతులే కాకుండా వాళ్ళ కూతురు అల్లుడు కూడా రావడం జరిగింది. అయితే.. మామూలుగానే కొండా సురేఖ అనుచరులు అతి చేస్తారని చాలా మంది చెబుతారు. వేములవాడ లో కూడా ఇదే జరిగింది. వాస్తవంగా వేములవాడ రాజన్నకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో... తీర్థ ప్రసాదాలు నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది.

అదే సమయంలో తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకున్నారు.  అయితే ఆమె ఆదేశాలు ఇచ్చారా లేక... ఇతర కారణాల తెలియదు కానీ... రాజన్నకు నైవేద్యం పెట్టకుండా మొదటగా కొండా సురేఖకు.. పూజలు నిర్వహించారు అక్కడి అర్చకులు. దాదాపు 30 నిమిషాల తర్వాత వేములవాడ రాజన్నకు నైవేద్యం పెట్టారు అర్చకులు.

ఇలా ఆలస్యంగా ఎప్పుడు పెట్టలేదట. ఈ విషయం తెలియగానే అక్కడే ఉన్న మహిళా భక్తులు కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రి అయితే... దేవుడిని ధిక్కరించాలా అని... రాజన్న సన్నిధిలో నిప్పులు జరిగారట.  అయితే ఇది అధికారుల తప్పిదమని కొంతమంది అంటున్నారు.  షెడ్యూల్ సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది అని చెబుతున్నారు.  ఇది ఇలా ఉండగా ఇప్పటికే సీఐ కుర్చీలో కూర్చోవడం అలాగే... అక్కినేని కుటుంబం పై కామెంట్స్ చేయడంతో కొండా సురేఖ  పై వివాదం కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: