తెలంగాణ: డియస్సీ కొత్త టీచర్లకి షాకిచ్చిన విద్యాశాఖ..వాయిదా దిశగా అడుగులు.?

FARMANULLA SHAIK
తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్న సంగతి తెలిసిందే.డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు నేడు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.కొత్త టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్స్ కు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఎక్కువగా కలెక్టరేట్లలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండనుందన్నారు.ఎస్జీటీకి ఒక హాల్, స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్ ఏర్పాటు చేసి..అందులో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ కేటాయిస్తారు. వారు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 16వ తేదీన చేరాల్సి ఉంటుంది.
వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం బదిలీ అయిన రిలీవ్ కాని వారు ఉన్నట్లయితే వారు గత జులైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్తారు. అలాంటి వారు సుమారు 7వేల మంది ఉన్నారు. పోస్టింగ్స్ కేటాయింపు మంగళవారం దాదాపుగా పూర్తవుతుందని ఏవైనా మిగిలినట్లయితే వాటిని బుధవారం పూర్తి చేస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇదిలావుండగా డీఎస్సీ టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. రాష్ట్రావ్యాప్తంగా ఇవాళ టీచర్లకు పోస్టింగ్ లు ఇవ్వాల్సివుండగా, కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా అక్టోబర్ 09వ తేదీన 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులిచ్చారు.అక్టోబర్ 10వ తేదీన దాదాపుగా వీరంతా జిల్లా కేంద్రాల్లో ఉండే డీఈవో కార్యాలయాల్లో రిపోర్టింగ్ చేశారు.
కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 10వ తేదీ నుంచి జీతాలను లెక్కకట్టనున్నారు. ఈ తేదీని ప్రామాణికంగా తీసుకొని జీతాలను జమ చేస్తారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల వివరాలను తీసుకుంటున్నారు.నియామకపత్రాలను అందుకున్న అభ్యర్థులకు ఏ క్షణమైనా కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.ఇప్పటికే జిల్లాల్లో ఖాళీలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.కౌన్సెలింగ్ తేదీలు ఖరారు అయితే… కొత్తగా ఎంపికైన టీచర్లు ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఆప్షన్లు, ఖాళీలను పరిశీలించి పని చేయాల్సిన పాఠశాలను విద్యాశాఖ ఖరారు చేస్తుంది.ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన వారికి మొత్తం జీతం రూ. 43,068గాను
స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు ఎంపికైన వారికి జీతం రూ. 58,691గా ఉంది.ఇదిలా ఉంటే మరికొన్ని ఖాళీలను గుర్తించి వాటిని కూడా భర్తీ చేయాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. కొద్ది నెలల కిందట అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు నెలలను కూడా వెల్లడించింది. తెలంగాణ విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి ప్ర‌భుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏమైనా ఖాళీలు ఉంటే వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వ‌నున్నారు. అలాగే టెట్ రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు.ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: