కేటీఆర్ కు బ్యాడ్ టైం? ప్లాన్లు అన్నీ రివర్స్ అవుతున్నాయి గా ?

Chakravarthi Kalyan

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. బీఆర్ఎస్ నేతలు పది ఏళ్ల పాటు అధికార హోదాను అనుభవించారు. పది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర నుంచి ఇరుకున పెట్టాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.


అందులో భాగంగానే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డు తగులుతూనే ఉన్నారు.ఫైనల్ గా ఆయన చేస్తున్న ఆరోపణలు.. ఆయన చేస్తున్న విమర్శలు బూమ్ రాంగ్ అవుతున్నాయి. ఫలితంగా ప్రజా క్షేత్రంలో పార్టీ మరింత అభాసుపాలవుతుంది. ఎంతో ఆశతో ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్న కేటీఆర్ కు ఆయన చేసిన విమర్శలు రివర్స్ అవుతున్నాయి. ఏ ఆశయంతో అయితే ముందుకు వెళ్దామని అనుకుంటున్నారో ఆయన లక్ష్యం నెరవేరడం లేదు.


ముఖ్యంగా అమీత్ స్కీంలో చాలా ఆరోపణలు చేశారు. అలాగే మూసీ సుందరీకరణలోను పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వ్యాఖ్యల చేశారు. ఇక హైడ్రా అంశంలోను పలు విధాలా విమర్శలు గుప్పించారు. వాటికి ప్రజల్లో పెద్దగా మైలేజ్ రాలేదని అర్థం అవుతుంది.


ఎంత సేపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ మొదటి నుంచి చూస్తూనే ఉంది. ఇందులో భాగంగా కేటీఆర్ చేస్తున్న వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి. అమృత్ స్కీం టెండర్లలో  ఏకంగా రూ.8888 కోట్ల అవినీతి జరిగిందని.. కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకే రూ.1137 కోట్ల టెండర్లు కట్టబెట్టారంటూ రాద్ధాంతం చేశారు. దీనిపై సృజన్ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇక మూసీ సుందరీకరణకు 2017లోనే బీఆర్ఎస్ రూపకల్పన చేసిందని ఆధారాలతో సహా కాంగ్రెస్ మంత్రులు బయట పెట్టారు. దీంతో కేటీఆర్ ఈ విషయంలోను ఫెయిల్ అయ్యారనే విశ్లేషకులు అంటున్నారు. ఇక దమగుండం రాడార్ విషయంలోను అదే పరిస్థితి ఎదురైంది. ఇలా పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో క్యాడర్ లో నైరాశ్యం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: