దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్..దర్శకుడు అతనే?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు... దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వెల మాధురి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 50 సంవత్సరాలు కు పైబడి ఉన్న దువ్వాడ శ్రీనివాస్.... తన కూతురు వయసున్న మాధురితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఈ తథంగాన్ని మొత్తం దువ్వాడ శ్రీనివాస భార్య వాణి బయట పెట్టారు. ఈ సంఘటన ఆగస్టు నెలలో జరిగింది. దీంతో అప్పటినుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో అలాగే... మెయిన్ స్ట్రీమ్ మీడియాలో... మాధురి అటు దువ్వాడ శ్రీనివాస ప్రేమ గురించి... నిత్యం వైరల్ అవుతూనే ఉంది.

అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి గురించి సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. వీరి ప్రేమ గురించి ఓ బయోపిక్ తీయబోతున్నారట టాలీవుడ్ నిర్మాత. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కూడా కాబోతుందట.  ఈ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత... సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్..  రాజకీయ నేపథ్యం అలాగే తన మొదటి భార్య తో జీవితం గురించి మొదటి భాగంలో చూపించనున్నాడట.

ఇక రెండవ భాగంలో మాధురితో ప్రేమాయణం..  తన ప్రేమ కోసం దువ్వాడ శ్రీనివాస్ చేసే త్యాగాల గురించి చూపించబోతున్నారట.  అయితే ఈ సినిమా కోసం దర్శకున్ని వెతికే పనిలోపడ్డాడట ఆ టాలీవుడ్ అగ్ర నిర్మాత. దీంతో ఇప్పుడు ఈ బయోపిక్ న్యూస్... సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల... మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్... తిరుమల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడ ఇద్దరు భార్యాభర్తల్లాగే శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అలాగే తిరుమల శ్రీవారి కొండపైన..  వీరిద్దరూ రీల్స్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.  దీంతో దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి పైన... టిటిడి అధికారులు పోలీసు కేసు పెట్టారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: