న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగాయి.. అందరికీ సమన్యాయం..!

Amruth kumar
వంద సంవత్సరాల పాటు పాలన సాగించిన బ్రిటిష్ విధానాన్ని యథావితిగా నేటికీ మన పాలకులు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కొన్నిటిని మారుస్తున్నప్పటికీ.. మరికొన్ని విషయాల్లో మార్పులు లేని పరిస్థితి కనిపిస్తుంది. న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టి సమన్యాయం అందరూ చట్టం ముందు సమానమేనే వాదనకు భిన్నంగా ఇప్పుడు తాజాగా సరికొత్త విధానంతో న్యాయ దేవత కళ్ళకు గంతులు తీసేసి తొలి సందర్భం తాజాగా చోటుచేసుకుంది. అంతేకాకుండా ఖ‌డ్డ‌ దారి అయిన న్యాయ దేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్తానం కల్పించన‌ వైనం ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఇన్ని రోజులు కళ్ళకు గంత‌లు కట్టిన న్యాయ దేవతకు చెప్పిన భాష్యానికి భిన్నంగా ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఇది భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో సరికొత్త న్యాయ దేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన చట్టానికి కళ్ళు లేవన్న పాత సిద్ధాంతాన్ని పక్కనపెట్టి న్యాయ దేవత కళ్ళకు గంత‌లు తీసేసారు.. కళ్ళతో చూస్తూ సమన్యాయం అందించే న్యాయ దేవత ఇప్పుడు తెర ముందుకు వచ్చినట్లయింది. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలతో న్యాయ దేవత విగ్రహంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లు లేని కబోది కాదని.. బ్రిటిష్ పాల‌న వాసనల్ని వదిలించుకొని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని ఆయన భావించారు.

 రాజుల కాలం నాటి ఖడ్గం తీరపు చెప్పటానికి బదులుగా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు చేశారు. ఎప్పటిలానే కుడి చేతిలో త్రాసును ఉంచారు. న్యాయం అందరికి సమానమేనని.. ఎవరికి ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవన్న విషయాన్ని స్పష్టం చేసే త్రాసును మాత్రం అలానే ఉంచేశారు. అంతేకాకుండా విదేశీ వనిత రూప్పంలో కాకుండా నిండైన మన భారతీయ వనితగా రెండు చేతులకు గాజులు, నగలు నిండైన చీరకట్లో అచ్చమైన భారత వనితల స్వచ్ఛతను స్పురణకు తెచ్చేలా న్యాయదేవత విగ్రహానికి తుది రూపు ఇనిచ్చినారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్‌మిడియ‌లో  వైరల్ గా మారాయి ఈ ఆసక్తికర చర్చకు తెర తీశాయి. ఇన్నేళ్ల తర్వాత మ‌న‌ న్యాయదేవతకు కొత్త రూపు ఇచ్చిన వైనం మారుతున్న భారతసమాజానికి నిదర్శనంగా నిలుస్తుందని కూడా చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: