జమిలి ఎన్నికలు: యాత్ర మొదలు పెట్టబోతున్న జగన్.. బాబుకు చుక్కలేనా..?

Divya
వైయస్సార్  కాంగ్రెస్ పార్టీని మరొకసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామస్థాయిలో నుంచి నిర్మాణాత్మకంగా ఉండేలా పలు రకాల ప్రణాళికలతో ముందుకు తీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.. 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని విషయాన్ని చాలామంది బలంగా నమ్ముతూ ఉండడంతో అటు మాజీ సీఎం జగన్  వైసిపి నేతల పనితీరు పైన సోషల్ మీడియా పైన కూడా పలు రకాల మానిటరింగ్ ఉంటుందనే విధంగా తెలియజేస్తున్నారు. ఇటీవల వైసిపి నేతలతో మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చురుకుగా పాల్గొనాలి అని జిల్లా అధ్యక్షులు అనుబంధ సంఘాల నేతలతో కూడా వైఎస్ జగన్ ఈ రోజున భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి దిశా నిర్దేశాలను కూడా ఇచ్చారట దేశంలో అత్యంత పొలమైన పార్టీగా వైసీపీని తయారు చేయాలని అందుకు అందరూ సాయి శక్తుల పనిచేయాలని పనిచేసిన వారికి రేటింగ్ ఇస్తామని వీటితోపాటు వారి కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది అంటూ వైఎస్ జగన్ తెలియజేశారు. ఇక ఎన్నికలలో ఓడిపోవడంపై వైసీపీ ప్రభుత్వం పైన ఎక్కడ వ్యతిరేకత లేదని కానీ ఫలితాలు మాత్రం చాలా భిన్నంగా వచ్చాయంటూ తెలిపారు.. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా 17 లక్షల శాంపిల్స్ రాష్ట్ర మంతా తీశామని ఆ సర్వేలో ఎక్కడా కూడా వైసీపీకి వ్యతిరేకత కనిపించలేదని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకుల మీద టిడిపి నాయకులు ఇబ్బంది పెడుతున్నారని.. ఇలా టిడిపి పాలనలో నష్టపోయిన కార్యకర్తలను తానే వెళ్లి స్వయంగా మాట్లాడించి భరోసా ఇస్తానంటూ తెలిపారట గత ఎన్నికలలో 40% ఓటింగ్ వచ్చిందని పార్టీ నేతలు అంత ప్రజల మధ్యనే ఉండాలి అంటూ సూచనలు ఇచ్చారు. అలాగే త్వరలోనే వీరందరిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపడతానంటూ కూడా మరొకసారి నేతలతో తెలియజేశారట. ఈసారి కచ్చితంగా అంతకుమించి అనేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇలాంటి సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అటు పథకాలను అమలు చేస్తారా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాట పయనిస్తారో లేదో చూడాలి మరి.. మరి ఓదార్పు యాత్రలో కచ్చితంగా సీఎం చంద్రబాబు తప్పులను జగన్ వేలెత్తి చూపిస్తారనే విధంగా వైసిపి కార్యకర్తలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: