సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు?
మంగళగిరి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు ఓ గంట సమయం పాటు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సజ్జల సంబంధం లేని సమాధానాలను చెప్పినట్టు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అయితే దానికంటే ముందు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద హైడ్రామా క్రియేట్ అయినట్టు సమాచారం.
విషయం ఏమిటంటే, పోలీసు విచారణ జరిగిన చోటికి పొన్నవోలు తనని కూడా అనుమతించాలని కోరగా పోలీసులు దానికి నిరాకరించడం జరిగినది. ఈ సందర్భంలో పొన్నవోలు పోలీసులకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాంతో దెబ్బతిన్న ఈ మంత్రులకి బుద్ధి రాలేదంటూ సామాన్య జనాలు కామెంట్లు చేస్తున్నారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్ ప్రాంగణంలోకి బయట వ్యక్తులు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం.
మరోవైపు, అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం వైసీపీ పార్టీకి చెందిన నాయకులే ధ్యేయంగా దాడులు, అక్రమ కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని సజ్జల ఓ మీడియా ముఖంగా వాపోయారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి తప్పుడు వాంగ్ములం సృష్టించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మరీ అవమానించి విచారిస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన రోజున బద్వేలులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉన్నానని, దాడికేసులో తన ప్రమేయం లేదని ఈ సందర్భంగా సజ్జల మీడియాతో తన గోడుని వెళ్లబుచ్చారు.