విజయవాడ పేరునే మార్చనున్న చంద్రబాబు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే... కొన్ని మంచి పనులు చేసిన చంద్రబాబు కూటమి సర్కార్... అనేక అపవాదులను కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి నేపథ్యంలోనే సరికొత్త అంశాన్ని కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
 

అదే విజయవాడ పేరు మార్పు. విజయవాడ మహా నగరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కొండపైన కనకదుర్గమ్మ తల్లి... కొండ కింద కృష్ణా నది  ఉండటం ఆ నగరానికి ఉన్న ప్రత్యేకత. అయితే అలాంటి విజయవాడ నగరం పేరు మార్చేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు వైసిపి సోషల్ మీడియా మాత్రం తెగ వైరల్ చేస్తోంది.
 

వి
జయవాడ పేరు తొలగించి... ఆ నగరానికి అమరావతి అని పేరు పెట్టబోతున్నారట. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు.  ఈ అమరావతి కూడా విజయవాడ సమీపాన్ని ఆనుకునే ఉంటుంది. చాలావరకు రాజధాని ఆఫీసులన్నీ విజయవాడలోనే ఉన్నాయి. గుంటూరు, మంగళగిరి ఇటు విజయవాడ ప్రాంతంలోనే అమరావతిని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.
ఈ నేపథ్యంలోనే ఈ అన్ని నగరాలను కలిపి... అమరావతి అనే నామకరణ అని చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఆ దిశగా ఇప్పటికే కేంద్ర పెద్దలతో పాటు ఏపీ కేబినెట్ తో కూడా చర్చలు నిర్వహించారట చంద్రబాబు నాయుడు. మోడీ అండదండలు ఉంటే ఈ పని సులువు అవుతుందని కూడా అనుకుంటున్నారట. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా మాత్రం తీవ్రంగా ట్రోలింగ్ చేయడం జరుగుతుంది.  విజయవాడ పేరును మార్చితే అమ్మవారికి కోపం వస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: