అబద్దాలు ఆడటం రాకే ఓడిపోయాను అంటున్న జగన్? ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

Chakravarthi Kalyan

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎక్కడో పప్పులో కాలు వేయడం జరగుతుంది. ఒకటి కూడా కాదు సవాలక్ష చేస్తారు. అయితే మేము ఏ తప్పు చేయలేదని అంతా చెప్పుకుంటుంటారు. వాటనిఇ వారు కన్వీనెంట్ గా మరిచిపోయినా తవ్వి తీయడానికి ప్రత్యర్థి పక్షాలు రెఢీగా ఉంటాయి. ఇక చూస్తే ఒక తప్పు పొరపాటు అయినా వంద చేసినా ఒక్కటే కాబట్టి ఈ రాజకీయాన్ని పూర్తిగా వాస్తవికతతో ఆలోచించి చేసుకుంటే పోలా అని చూసే వారే ఎక్కువ మంది ఉన్నారు.


వైసీపీ అధినేత జగన్ విషయం తీసుకుంటే కొంత ఢిపరెంట్ గా కనిపిస్తారు. ఆయన పబ్లిక్ మీటింగ్ లో పార్టీ సమావేశాల్లో కూడా విలువలు విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాను చెప్పినదే చేస్తాను చేయనిది చెప్పను అని అంటారు. అధికారం కోసం అబద్ధాలు ఆడటం తనకు చేత కాదని జగన్ చెప్పేస్తారు.


తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురి అవుతూనే తాను అబద్ధాలు చెప్పలేదు కాబట్టే ఓడాను అని అన్నారు. అయినా ఓటమి గెలుపు రాజకీయాల్లో మామూలే అని ఆయన సమర్థించుకున్నారు. తాను అబద్దాలు చెప్పలేనని ఆయన ఒప్పుకున్నారు. తప్పుడు హామీలు ఇస్తే అధికారం దక్కుతుంది కానీ విలువలు విశ్వసనీయత ఎప్పటికైనా ముఖ్యం అని జగన్ అన్నారు.


అందుకే ఆ పని తాను ఎప్పటికీ చేయనని జగన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. జగన్ అబద్దాలు ఆడలేదా అది నిజమా అంటూ ఆయన 2019లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని కానీ గతం కంటే ఎక్కువ మద్యం తన పాలనలో అమ్మి ఎక్కువగా ఆదాయం తెచ్చారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.


అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు చెందారని ప్రశ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: