ఏపీ: క్వాలిటీ మద్యం.. బాబుకే ఎఫెక్ట్..!

Divya
ఎన్నికల ముందు క్వాలిటీ మద్యం అంటే కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకొని మరి మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పుడు అన్నట్టుగానే క్వాలిటీ మద్యంతోపాటు మద్యం షాపులను ప్రైవేటీకరణం చేయడం జరిగింది. అయితే ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారంగా అవుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రైవేటీకరణం చేసిన తర్వాత సర్కారు ఇందులో లోపాలను గుర్తించలేకపోయింది. ఇందులో సుమారుగా 20000 మంది దాకా ఉద్యోగులు బయటికి వచ్చేసారు. ఇప్పుడు ప్రైవేటీకరణ కావడం చేత మందు షాపుల వద్ద చాలామంది ప్రజలు యజమానులతో గొడవలు దిగుతున్నారట.

అందుకు ముఖ్య కారణం ఎంఆర్పి ధరల కంటే క్వార్టర్ పైన రూ .10రూపాయల నుంచి కొన్నిచోట్ల ఫుల్ బాటిల్ పైన 50 రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారట. కొంతమంది ప్రశ్నిస్తే మరి కొంత మంది మౌనంగా ఉన్నప్పటికీ యజమానులు మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదట. ఎవరైనా అడిగితే ఎంపీ ఎమ్మెల్యేలకు కమిషన్ ఇవ్వాలి అంటూ ఫైర్ అవుతున్నారట. ఇక పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇది ఎక్స్చేంజ్ శాఖకు సంబంధించింది మేము తీసుకోమని తెలియజేస్తున్నారట. అక్కడ కూడా సరైన సమాధానం దొరకలేదట..

ముఖ్యంగా పెరిగిపోయిన కమిషన్ల బాగోతంతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు పలు నగరాలలో పంచాయతీలలో జిల్లాలలో గ్రామస్థాయిలలో కూడా వాటాలు కావాలని అందరూ అడుగుతూ ఉండడంతో యజమానికి వచ్చే లాభాలను కమిషన్లు పంపితే అసలు లాభాలు ఉండవని అందుకే ధరలు పెంచినట్లుగా సమాచారం. ప్రస్తుతం 180 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ 200 వరకు అమ్ముతున్నారట. ముఖ్యంగా రద్దీని బట్టి బ్రాండ్ సరుకులు బట్టి డిమాండ్ కూడా పెంచేస్తున్నారట. ఇది మందు బాబుల నుంచి వ్యతిరేకత తీసుకువచ్చేలా చేస్తుంది. ఎమ్మార్పీ అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అందుకు వేరే విధంగా క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఇవే కాకుండా పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలకు పార్టీలకు ఉచితంగా కూడా మందు పంపిణీ చేయాలని ఇవన్నీ కూడా తమపైనే పడుతున్నాయి అంటూ షాప్ యజమానులు తెలియజేస్తున్నారట. దీంతో అటు ఇటు చూసిన మద్యం వల్ల సీఎం చంద్రబాబుకు తలనొప్పి చుట్టుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: