అనుకూల పత్రికల్లో వ్యతిరేక కథనాలు.. చంద్రబాబు షాకింగ్ రియాక్షన్ వైరల్!
చంద్రబాబుకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలా వ్యవహరించాలనే ఆలోచనతోనే ఆ పత్రికలు సైతం సరైన దారిలో అడుగులు వేస్తోంది. అయితే అనుకూల పత్రికలలో వ్యతిరేక కథనాల గురించి కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు. ఈ కథనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాన్ని సైతం వాళ్లు తెలియజేశారు. అయితే ఈ కామెంట్ల విషయంలో చంద్రబాబు కూల్ గా రియాక్ట్ కావడం గమనార్హం.
మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండని ఆ కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు నేతలకు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అలా చెప్పడంతో ఆ కథనాల విషయంలో కూటమి నేతలకు సైతం టెన్షన్ తగ్గింది. తమ గురించి పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చినా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని టీడీపీ కీలక నేతలు ఫీలవుతున్నారు.
అయితే చంద్రబాబు ఇవే కథనాలు సాక్షిలో వస్తే మరో విధంగా రియాక్ట్ అవుతారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆ కథనాల విషయంలో సైలెంట్ గా ఉంటారని అనుకోవద్దని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకుంటారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న మెజారిటీ నిర్ణయాలపై ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా కొన్ని నిర్ణయాల విషయంలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. చంద్రబాబు పాలన జగన్ పాలన కంటే మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.