ఎంతకు తెగించారో..! నెతన్యాహూపైనే డ్రోన్ ఎటాక్, మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Chakravarthi Kalyan

లెబనాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంది. లెబనాన్ నుంచి డ్రోన్ దాడి జరిగింది. సెంట్రల్ ఇజ్రాయెల్ సిటీ సిజేరియాలోని ప్రధాని మంత్రి బెంజిమాన్ నెతన్యాహూ ఇంటిపై డ్రోన్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. సిజేరియా సెంట్రల్ ప్రాంతంలో హిజ్బుల్లా మూడు డ్రోన్లతో దాడి చేసింది.


వాటిలో ఒకటి ప్రధాని ఇంటిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ చెబుతున్నాయి. ఈ డ్రోన్ పడిపోయిన భవనం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సిజేరియాలో డ్రోన్ దాడికి సంబంధించి.. ఆ సమయంలో  బెంజిమాన్ నెతన్యాహూ అతని భార్య వారి నివాసంలో లేరని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. హిజ్భుల్లా డ్రోన్ ల దాడి ప్రధాని మంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం హెలీకాఫ్టర్ నుంచి డ్రోన్ లక్ష్యంగా చేసుకుంది.


సిజేరియా ప్రాంతంలో పేలుడు శబ్ధం వినిపించిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. లెబనాన్ నుంచి వచ్చిన ఈ విమానం దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. ఐరన్ డోమ్ ఈ డ్రోన్లను ఆపలేకపోయింది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో డ్రోన్ సులభంగా ప్రవేశించిందని కథనంలో పేర్కొంది. ఆర్మీ హెలీకాఫ్టర్ పక్కనే ఈ డ్రోన్ వచచిందని చెబుతున్నారు.


సెప్టెంబరు 23 నుంచి లెబనాన్ లో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించింది. ఈ సమయంలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సెప్టెంబరు 27న బీరూట్ లో వైమానిక దాడిలో మరణించాడు. అక్టోబరు మొదటి వారంలో ఇజ్రాయెల్ కూడా నస్రల్లా వారసుడు సఫీద్దీన్ చంపినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై తన దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ లోని అన్ని ప్రాంతాలు తమ లక్ష్యమని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్‌ నయూమ్ ఖాసిం కొద్ది రోజుల క్రితమే చెప్పారు. మరోవైపు లెబనాన్ లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో సుమారు 2000 మంది చనిపోగా  12 లక్షల మంది నిరాశ్రయిలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: