టీడీపీలో దూకుడు చూపిస్తున్న ముగ్గురు రెడ్డెమ్మలు.. పార్టీకి మైనస్ అవుతున్నారా?

Reddy P Rajasekhar
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి హవా నడుస్తోంది. కూటమి 175 స్థానాలలో ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించి చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ బ్రేక్ కావడం ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే ముగ్గురు రెడ్డెమ్మలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో దూకుడు చూపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ ముగ్గురు రెడ్డెమ్మలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.
 
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వయస్సులో చిన్నవారు అయినప్పటికీ రాజకీయాలలో దూకుడు ప్రదర్శించడం ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. అఖిలప్రియకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. రాజకీయంగా ఆమె ఒకింత దూకుడుతో వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారనే చెప్పాలి. అఖిలప్రియ తీరు వల్ల ప్రజల్లోకి మరో తరహా సంకేతాలు వెళ్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
సొంత పార్టీ వాళ్లు సైతం ఆమె వల్ల ఇబ్బంది పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరు విషయంలో సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. మాధవీరెడ్డి పాలన విషయంలో కడప ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తితో అయితే లేరనే చెప్పాలి. ఆమె గురించి చంద్రబాబు, లోకేశ్ లకు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
పులివర్తి సుధారెడ్డి రూపంలో కూటమికి మరో తలనొప్పి ఎదురైందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. సుధారెడ్డి మాటతీరు విషయంలో టీడీపీ అనుకూల పత్రికలలోనే వ్యతిరేక కథనాలు వచ్చాయి. పులివర్తి సుధా తీరు విషయంలో సొంత పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముగ్గురు మహిళా నేతల విషయంలో టీడీపీ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. తెలుగుదేశం పార్టీలో  హద్దులు దాటి ప్రవర్తిస్తున్న నేతల విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఒకింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: