మద్యం తాగేముందు ఆ రెండు చుక్కల వెనక.. ఇంత పెద్ద స్టోరీ ఉందా?
మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రారంభించి ఉండవచ్చు. ఆ రోజుల్లో ప్రకృతి శక్తులను దేవుళ్లుగా భావించేవారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం కోసం ఈ విధంగా చేసేవారు. కాలక్రమంలో ఇది మన సంస్కృతిలో ఒక భాగమైపోయింది. కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారాన్ని చెడు శక్తులు లేదా దుష్ట ఆత్మలను దూరం చేయడానికి చేస్తారు. అంటే, మనం తాగే ముందు కొన్ని చుక్కలు నేల మీద చల్లితే, మనల్ని ఇబ్బంది పెట్టే ఏదైనా చెడు శక్తి ఉంటే అది దూరమైపోతుందని నమ్మకం.
ఈ ఆచారం మనకు ఉన్న వస్తువుల గురించి కృతజ్ఞతగా ఉండటాన్ని నేర్పుతుంది. అంతేకాకుండా చాలా కాలం క్రితం రాజులు, రాణులు ఈ ఆచారాన్ని విషం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. అంటే, వారు తాగే పానీయంలో ఏదైనా విషం కలిపి ఉంటే, ఆ విషం నేల మీద చల్లిన ఆల్కహాల్‌తో ప్రతిచర్య చూపిస్తుందని నమ్మేవారు. అలాంటి ప్రతిచర్యను బట్టి పానీయం తాగడం సురక్షితమో లేదో నిర్ణయించేవారు. ఇది చాలా తెలివైన పద్ధతి అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో రాజుల మధ్య పోరు, అధికారం కోసం పోటీ ఎక్కువగా ఉండేవి. అందుకే, రాజులను చంపడానికి విషం ఇచ్చే ప్రయత్నాలు జరిగేవి. అలాగే నేలపై లిక్కర్ చల్లినప్పుడు బుడగలు వస్తే అది చాలా స్ట్రాంగ్ డ్రింక్ అని కూడా అర్థం చేసుకునేవారు. సో ఇదన్నమాట ఆ రెండు చుక్కల వెనుక ఉన్న కథ!!