చెల్లికి సగం ఆస్తి ఇవ్వనున్న జగన్.. వాళ్ల రాయబారంతో లెక్కలు మారిపోయాయా?

Reddy P Rajasekhar
ప్రతి ఒక్కరి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సాధారణం అనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు చిన్నచిన్న సమస్యలే పెద్దవిగా మారి కుటుంబ సభ్యుల మధ్య విబేధాలను సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి. అలా జగన్ కు షర్మిల రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన షర్మిల ఈ మధ్య కాలంలో మాత్రం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
 
జగన్ సైతం ఎన్నికల ఫలితాల అనంతరం కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తప్పవని ఫిక్స్ అయ్యారు. అయితే చెల్లికి సగం ఆస్తి ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. కర్ణాటక కాంగ్రెస్ పెద్దలతో తన ఆస్తిలో సగ భాగం చెల్లికి ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. సొంతింటి నుంచి జగన్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు.
 
షర్మిల సైతం ఆస్తి సంబంధిత సమస్యల వల్ల ఇంతకాలం జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించడం జరిగింది. జగన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. షర్మిల, జగన్ కలిస్తే కూటమి నేతలకు ఇబ్బందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల జగన్ కు సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తే నెటిజన్ల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంది.
 
ఆస్తిలో భాగం ఇచ్చిన తర్వాత షర్మిల ప్లేట్ ఫిరాయిస్తారా? లేక మాట మారుస్తారా? అనే చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం షర్మిలకు కాంగ్రెస్ లో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. బీజేపీ సైతం జగన్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో జగన్ తెలివిగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. జగన్ 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సీఎం కావాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: